Health Tips: ఎండాకాలంలో ఐస్ క్రీంలు ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!
Health Tips: ఎండాకాలంలో పిల్లలు, పెద్దలు ఐస్ క్రీంలు ఎక్కువగా తింటారు. రుచిగా ఉండటంతో ఎక్కువగా లాగించేస్తారు. ఇవి వేడి నుంచి తక్షణ
Health Tips: ఎండాకాలంలో పిల్లలు, పెద్దలు ఐస్ క్రీంలు ఎక్కువగా తింటారు. రుచిగా ఉండటంతో ఎక్కువగా లాగించేస్తారు. ఇవి వేడి నుంచి తక్షణ ఉపశమనం కలిగించవచ్చేమో కానీ ధీర్ఘకాలింకంగా చాలా ప్రమాదకరం. మితిమీరి ఐస్‌క్రీములు తినడం వల్ల స్థూలకాయం, మధుమేహం బారిన పడుతారు. వీటికి తోడు రసాయనాలు కలిసిన కూల్‌డ్రింకులు తాగితే పేగుల్లో సమతుల్యత దెబ్బతిని జీర్ణకోశ సమస్యలూ ఏర్పడుతాయి. ఐస్ క్రీంలు తయారు చేయడానికి ప్రమాదకరమైన ద్రావకాలని వాడుతారు. అందులో ఎక్కువగా ‘లిక్విడ్ నైట్రోజన్'(Liquid Nitrogen) వాడుతారు. దీనివల్ల ఐస్ క్రీంలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ ద్రావనానికి రంగు ఇంకా అలాగే వాసన అనేవి అసలు ఉండవు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందుకే ఐస్ క్రీంలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
వైద్య నిపుణుల ప్రకారం.. ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు మూడు ఐస్‌క్రీమ్‌లు తింటే 1000కి పైగా క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. దీంతో బరువు పెరుగుతారు. ఐస్‌క్రీమ్‌లో పరిమిత కొవ్వు ఉంటుంది. ఐస్ క్రీం అతిగా తింటే.. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎవరికైనా అధిక రక్తపోటు, అధిక బరువు ఉంటే రోజూ ఐస్‌క్రీం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఐస్ క్రీంను మితంగా తీసుకోవాలి. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకునేవారవుతారు.
ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రాచీన పద్దతులని అనుసరించడమే బెస్ట్. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో చద్దన్నానిదే అగ్రస్థానం. వేసవిలో ఉదయంపూట వేడివేడిగా తినే అల్పాహారాల కంటే చల్లగా చద్దన్నం తినడమే శ్రేష్ఠం. భారత ఉపఖండంలోను, దక్షిణాసియా దేశాల్లోను చద్దన్నం తినడం తరతరాల అలవాటు. వేర్వేరు ప్రాంతాల్లో చద్దన్నాన్ని వేర్వేరు పేర్లతో పిలుచుకుంటారు. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇక వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరినీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలను తాగడం మంచిది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి