AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ప్రతిరోజు పిస్తాపప్పు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Health Tips: పిస్తా పప్పు చూడగానే నోరూరుతుంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో

Health Tips: ప్రతిరోజు పిస్తాపప్పు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
Pista Pappu
uppula Raju
|

Updated on: Apr 22, 2022 | 7:37 PM

Share

Health Tips: పిస్తా పప్పు చూడగానే నోరూరుతుంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, కేలరీలు ఉంటాయి. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బోలెడ లాభాలున్నాయి. మీకు ఆకలిగా అనిపిస్తే సాయంత్రం అల్పాహారంగా పిస్తాపప్పులను తినవచ్చు. ఇది ఆరోగ్మానికి ఎంతో మంచిది. అయితే ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా పప్పు ఒకటి.​వాస్తవానికి పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

పిస్తా తినడం వల్ల ప్రయోజనాలు

డ్రై ఫ్రూట్స్‌ అన్నింట్లోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి6 శరీరానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. పిస్తాలోని అధిక ఫైబర్‌, ప్రొటిన్‌ కారణంగా కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో తక్కువగా ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

పిస్తాలో ఉండే విటమిన్‌ బి 6 ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియాను పెంపొందిస్తుంది. ఇందులో ఉండేది ఎక్కువగా ఆరోగ్యకరమైన కొవ్వే కాబట్టి కచ్చితంగా డైట్‌లో పిస్తాను చేర్చుకుంటే మంచిది. బలమైన ఎముకలకు విటమిన్ డి, కాల్షియం అవసరం. ఈ రెండు పిస్తాపప్పులో ఉంటాయి. ఈ పరిస్థితిలో దీని రోజువారీ వినియోగం ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధులని తొలగిస్తుంది. కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. వీటి ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కంటికి మేలు చేసే A, E విటమిన్లు పిస్తాపప్పులో పుష్కలంగా ఉంటాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: పృథ్వీ షా వల్ల డేవిడ్ వార్నర్ రిలాక్స్‌ అవుతున్నాడు.. ఎలాగంటే..?

Viral Video: బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న జనాలు.. ఒక్కసారిగా కుప్పకూలిన విమానం..!

BEL Recruitment 2022: డిప్లొమా, ఐటీఐ చేసినవారికి సువర్ణవకాశం.. ఇంకా 8 రోజులే మిగిలి ఉన్నాయి..!