AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato Chips: ఆలుచిప్స్ తెగ తింటున్నారా ? జాగ్రత్త సుమీ.. మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆలుచిప్స్ ఇష్టంగా లాగించేస్తుంటారు. సాయంత్రం వేళ కరకరలాడే స్పైసీ ఆలు చిప్స్ తింటూ

Potato Chips: ఆలుచిప్స్ తెగ తింటున్నారా ? జాగ్రత్త సుమీ.. మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..
Potato Chips
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2022 | 7:55 PM

Share

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆలుచిప్స్ ఇష్టంగా లాగించేస్తుంటారు. సాయంత్రం వేళ కరకరలాడే స్పైసీ ఆలు చిప్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు.. భోజనంలోనూ చిప్స్ విపరీతంగా తినేస్తారు. బంగాళదుంప చిప్స్ తినడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. అయితే శ్రుతిమించితే అమృతం కూడా ప్రమాదమే అంటారు.. పరిమితిదాటి తీసుకుంటే ఎంతటి ఆరోగ్యకరమైన పదార్థాలపై శరీరానికి హాని చేస్తాయి. నిజమే.. ఇటీవల జరిగిన పరిశోధనలో ఆలు చిప్స్ ఎక్కువగా తింటే శారీరానికీ హానికరమని అంటున్నారు నిపుణులు. ఈ చిప్స్ ఆరోగ్యానికి దుష్ప్రభావాలను కలిగిస్తాయట. రక్తపోటును పెంచడమే కాకుండా.. రక్తహీనత సమస్యను కూడా కలిగిస్తాయి. బంగాళదుంప చిప్స్ తినడం వలన కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందామా.

ఆలుచిప్స్ ను నూనె, ఉప్పుతో తయారు చేస్తారు. చాలా క్రిస్పీగా ఉండే ఆలు చిప్స్ రక్తపోటు స్థాయిలను పెంచుతాయి. అలాగే గుండె జబ్బుల సమస్యలను పెంచుతాయి. మయో క్లినిక్ ప్రకారం.. చిప్స్ రక్తపోటును పెంచడమే కాకుండా.. మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. డిమెన్షియా వంటి పరిస్థితులకు దారి తీస్తుంది. ప్రాసెస్ చేయబడిన చిప్స్ లలో అధిక స్థాయిలో ఉప్పు ఉంటుంది. ఇది శరీరానికి హాని చేస్తుంది. ఆలు చిప్స్ ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది. అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ ప్రకారం ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో అక్రిలమైడ్ అనే రసాయం ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకాలను కలిగి ఉంటుంది. దీంతో శరీరంలో క్యాన్సర్ పెరుగుదలను పెంచుతుంది. ఆలు చిప్స్ గుండె జబ్బులను పెంచుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన 2009 అధ్యాయనం ప్రకారం.. యాక్రిలమైడ్ అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇవే కాకుండా.. చిప్స్ ఎక్కువగా తినడం వలన వంధ్యత్వానికి దారితీస్తుంది. కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉనికి పునర్పుత్తి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపిస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రాకంర ట్రాన్స్ ఫ్యాట్స్ మహిళల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే ఈ ఆలు చిప్స్ అనేవి బరువు పెరగడానికి సహయపడతాయి. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడిని పెంచుతుంది. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడిన 2016 అధ్యయనం ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్‏లను ఎక్కువగా తీసుకోవడం వలన డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.

గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు… ఇతర వెబ్ సైట్స్.. పరిశోధనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Samantha: నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ట్వీట్..

Allu Arjun: పుష్పరాజ్ పై పొగడ్తలు కురిపించిన కేజీఎఫ్ 2 బ్యూటీ.. నేను మీ వీరాభీమానినంటూ..

Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Health Tips: వేసవిలో వీటిని రాత్రంతా నానబెట్టి తింటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. అవెంటో తెలుసా..