Diabetes Control: నేరేడు గింజలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చు.. పొడిని ఇలా తయారు చేసుకోండి..
Jamun Seeds Powder: వేసవిలో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తాయి. జామున్ పండు నుంచి గింజలు, ఆకులు.. బెరడు ఇవన్నీ ఆయుర్వేదంలోని అనేక ఔషధాలలో ఉపయోగిస్తారు.
Jamun Seeds Powder: వేసవిలో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తాయి. జామున్ పండు నుంచి గింజలు, ఆకులు.. బెరడు ఇవన్నీ ఆయుర్వేదంలోని అనేక ఔషధాలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు జామున్ చాలా ప్రయోజనకరమని నిపుణులు పేర్కొంటున్నారు. జామూన్ తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. దీంతోపాటు పలు రకాల వ్యాధులు దూరం అవుతాయి. దీంతోపాటు జామూన్ విత్తనాలు కూడా మధుమేహ (Diabetes) రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జామున్ గింజలను పొడి చేసి నీటిలో కలుపుకొని తాగాలి. ఇది మధుమేహానికి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్‌కు దివ్య ఔషధం..
నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జామున్ గింజలలో జంబోలిన్, జాంబోసిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర విడుదల ప్రక్రియను నెమ్మదిగా మార్చి ఇన్సులిన్ స్థాయిని పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం తీసుకునే ముందు ఈ పొడిని తీసుకోవాలి.
జామున్ గింజల నుండి పొడిని ఎలా తయారు చేయాలి
- ముందుగా నేరేడు పండ్లను శుభ్రంచేయాలి. గుజ్జు నుంచి గింజలను వేరు చేయాలి.
- ఇప్పుడు విత్తనాలను మరోసారి కడిగి పొడి క్లాత్ పై ఉంచి 3-4 రోజులు ఎండలో ఆరబెట్టండి.
- పూర్తిగా ఆరిన తర్వాత వాటి బరువు తగ్గినట్లు అనిపించగానే.. దాని పైన ఉన్న సన్నటి తొక్కను తీసివేసి గింజలను మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
- దీని ప్రయోజనాల కోసం ఉదయాన్నే పరగడుపున నేరేడు గింజల పొడిని పాలలో వేసుకోని తాగండి.
- మీరు రోజూ ఈ పొడిని తీసుకుంటే.. డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.
నేరేడు ప్రయోజనాలు
1- రోజూ జామూన్ తినడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.
2- జామున్ బెరడు కషాయం తాగడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి.
3- నేరేడు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
4- జామూన్ తినడం ద్వారా శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది. రక్తహీనత కూడా తగ్గుతుంది.
5- కీడ్నీల్లో రాళ్ల సమస్య ఉంటే జామున్ గింజల పొడిని చేసి పెరుగులో కలుపుకుని తింటే.. ఉపశమనం కలుగుతుంది.
గమనిక: అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: