Eggs Boiling: గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగులుతున్నాయా.. ఇలా చేస్తే అస్సలు పగలవు..!
Eggs Boiling: కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోవడం అనేది నిత్యం ఎదుర్కొనే సాధారణ సమస్య. గుడ్లు పగిలిపోయి తెల్లసొన నీటిలో కలుస్తుంది.
Eggs Boiling: కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోవడం అనేది నిత్యం ఎదుర్కొనే సాధారణ సమస్య. గుడ్లు పగిలిపోయి తెల్లసొన నీటిలో కలుస్తుంది. దీంతో గుడ్డులో పోషకాలు ఏమి ఉండవు. దాదాపు ఈ గుడ్డు తిన్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాస్తవానికి ఉడికించిన గుడ్డు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. మీరు వాటిపై కొంచెం ఉప్పు, నల్ల మిరియాలు చల్లి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే గుడ్లని ఉడకబెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే పెంకు సులువుగా రావడమే కాదు గుడ్డు కూడా సూపర్‌గా ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.
1. చాలా మంది కోడిగుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసి నేరుగా వంటకు ఉపయోగిస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మొదటగా వాటిని గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాత వాటిని ఉపయోగించడం ముఖ్యం. మీరు చల్లటి గుడ్లను నేరుగా వేడి నీటిలో ఉడకబెట్టినట్లయితే అవి పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2. మీరు గుడ్లు ఉడకబెట్టేటప్పుడు గిన్నెలోని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేయాలి. ఇలా చేస్తే గుడ్లు పగలకుండా ఉంటాయి. అయితే గిన్నె కొంచెం పెద్దగా ఉండాలి. గుడ్లు ఒకదానికొకటి అంటుకొని ఉండకూడదు.
3. గిన్నెలో నీరు మరుగుతుండగా గుడ్లు ఎప్పుడు అందులో వేయకూడదు. అలావేస్తే గుడ్డు నీటిలోనే పగిలిపోతాయి. ఒక గిన్నెలో 3-4 గుడ్ల కంటే ఎక్కువ ఉడకబెట్టవద్దు.
4. గుడ్లు సుమారు 15 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు గుడ్లను వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో వేయాలి. సుమారు 10 నిమిషాల తరువాత వాటి పెంకులు తీయాలి. గుడ్డు పగలకుండా సులభంగా వస్తుంది.
5. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు గిన్నెలో గుడ్లు మొత్తం మునిగేవిధంగా నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు ఒకదానికొకటి ఢీకొనవు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి