Curd: పెరుగు తింటే అసలు తిరుగుండదు.. కానీ వీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి

పెరుగులో మన బాడీకి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచి, ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. సకల పోషకాల మిళితమైన పెరుగు రోజూ తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది.

Curd: పెరుగు తింటే అసలు తిరుగుండదు.. కానీ వీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి
Curd
Follow us

|

Updated on: Apr 23, 2022 | 12:15 PM

Heath Tips: చాలామంది కూరన్నమే ఎక్కవ తింటారు. పెరుగన్నం తినేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపించరు. పెరుగు తింటే వెయిట్ గెయిన్ అవుతామనే భావన కూడా చాలామందిలో ఉంది. కానీ పెరుగు పరిమితంగా తింటే లెక్కకు మించి ఉపయోగాలు ఉన్నాయ్.. అవేంటో తెలుసుకుందాం పదండి. పెరుగులో మన బాడీకి మేలు చేసే బ్యాక్టీరియా(good bacteria) ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్(Immunity power) పెంచి, ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే చాన్స్ చాలా తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.

  1. కొందరికి తరచూ ఛాతీలో మంటగా ఉంటుంది. ఈసీజీ వంటి టెస్టులు చేసి.. అంతా బానే ఉందని చెబుతారు డాక్టర్లు. కొన్నిసార్లు సమస్య లేకపోయినా నొప్పి, మంట వస్తూనే ఉంటాయి. దీనికి కారణం జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు రావటం. ఇలాంటివారు రోజూ పరగడుపున రెండు చెంచాల పెరుగు తింటే చాలా బెటర్. పెరుగు ఛాతీలో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  2. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవాలి. పెరుగు క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
  3. ప్రతిరోజూ పెరుగు తీసుకునే వారిలో గుండె సంబంధిత సమస్యలు చాలామటుకు కంట్రోల్‌లో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల హైబీపీ కూడా అదుపులోకి వస్తుంది.
  4. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది  కొన్ని సందర్భాల్లో చాలా ఒత్తిడి ఫీల్ అవుతారు. రకరకాల ప్రెజర్స్ ఉంటాయి.  అలాంటప్పుడు కప్పు పెరుగు తిని చూడండి. అది ఒత్తిడిని ఇట్టే మాయం చేస్తుంది. మైండ్‌కు ప్రశాంతతను కూడా అందిస్తుంది.
  5. పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్ఫరస్‌ కూడా ఉంటుంది. ఇది క్యాల్షియంతో కలవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపొరోసిస్‌ లాంటి ప్రాబ్లమ్స్ ఎదురుకాకుండా ఉంటాయి.
  6. పెరుగు జీర్ణక్రియకు మంచిది

అయితే కీళ్లనొప్పులు ఉన్నవారు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవారు, ఆస్తమా రోగులు, అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు.. పెరుగును తీసుకోకపోవడమే బెటర్.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Telangana: ఏరుకోండి.. ఏరుకోండి.. ఈ సీన్ చూస్తే మీరు కచ్చితంగా స్టన్ అవుతారు