Telangana: ఏరుకోండి.. ఏరుకోండి.. ఈ సీన్ చూస్తే మీరు కచ్చితంగా స్టన్ అవుతారు
కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీ కొన్నాయి. ఈ క్రమంలో కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్ కూడా బోల్తా పడింది. ఆ తర్వాత స్థానికులు ఏం చేశారో చూడండి.
Karimnagar: కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, రెండు వ్యాన్‌లు వెంట వెంటనే ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. వీటిలో ఒక వ్యాన్ కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తోంది. ప్రమాదంలో ఈ కోడిగుడ్ల వ్యాన్ బోల్తాపడి, గుడ్ల ట్రేలు అన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే దగ్గర్లోని గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయ్యో..! సాయం చేయడానికి పరుగు పరుగున వచ్చారు అనుకోకండి. వారు వచ్చింది కోడి గుడ్ల కోసం. అవును కోడిగుడ్లు ఎత్తుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. ఏకంగా బకెట్లు, పెద్ద, పెద్ద సంచుల్లో వేసుకుని పగలని గుడ్లు ఇళ్లకు తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ నుండి జగిత్యాల(Jagtial) వైపు వెళ్తున్న ఓ వ్యాన్ ఇస్లాంపూర్ వద్దకు రాగానే ఆగిపోవడంతో రోడ్డు పక్కన నిలిపాడు డ్రైవర్. దీంతో ఇది గమనించకుండా కోడిగుడ్ల లోడుతో వస్తున్న వ్యాన్ ముందు నిలిపి ఉంచిన వ్యాన్‌ను ఢీకొట్టింది. దాంతో కోడిగుడ్ల వ్యాన్ బోల్తా పడింది. అదే సమయంలో జగిత్యాలనుంచి వస్తున్న ఓ పెళ్లి బస్సు ఈ ప్రమాదాన్ని గమనించకుండా కోడిగుడ్ల వాహనాన్ని ఢీ కొట్టింది. ఒకటి తర్వాత ఒకటి ఇలా వాహనాలు ఢీ కొన్నాయి. అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజామున స్థానిక గ్రామ ప్రజలు ఈ ప్రమాదాన్ని గమనించారు. కోడిగుడ్ల బండి పడిపోయింది అని తెలియగానే గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హుటాహుటిన వచ్చి కోడిగుడ్లను ఎత్తుకెళ్లారు ఈ ప్రమాదంలో ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Also Read: AP: ఏపీలో రేషన్ కార్డుదారులకు కీలక అప్‌డేట్.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్