Pawan kalyan – Vijay: పవన్ కల్యాణ్ గెలుపుపై విజయ్ దళపతి రియాక్షన్.. ఏమన్నారో తెలుసా?

21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి భారీ మెజారితో గెలుపొందారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పవన్ కు విషెస్ చెబుతున్నారు

Pawan kalyan – Vijay: పవన్ కల్యాణ్ గెలుపుపై విజయ్ దళపతి రియాక్షన్.. ఏమన్నారో తెలుసా?
Vijay Thalapathy, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jun 05, 2024 | 11:04 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి భారీ మెజారితో గెలుపొందారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పవన్ కు విషెస్ చెబుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత దళపతి విజయ్ పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన పర్సనల్ అకౌంట్ నుంచి కాకుండా టీవీకే పార్టీ సోషల్ మీడియా నుంచి వేర్వేరుగా ట్వీట్లు చేశారు. ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు అభినందనలు. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉంది. ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు, మీ పట్టుదల అందరికి స్ఫూర్తి దాయకం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను ‘ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు విజయ్.

ఇక మరో ట్వీట్ లో చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ‘ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి అభినందనలు. మీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అదృష్టం పరీక్షించుకోనుంది. మరి పవన్ లాగే విజయ్ తమిళనాడులో జెండా ఎగరవేస్తాడేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు