Election Result 2024: పవన్ టు కంగనా.. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సినిమా తారలు వీరే.. ఫుల్ లిస్ట్

ఈ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. కొందరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే, మరికొందరు అసెంబ్లీ స్థానాల కోసం బరిలోకి దిగారు. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన సినిమా తారలెవరో తెలుసుకుందాం రండి.

Election Result 2024: పవన్ టు కంగనా.. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సినిమా తారలు వీరే.. ఫుల్ లిస్ట్
Movie Celebrities
Follow us
Basha Shek

|

Updated on: Jun 05, 2024 | 8:59 AM

లోక్‌సభ ఎన్నికల 2014 ఫలితాలు మంగళవారం (జూన్ 04) వెలువడ్డాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయేకు సాధారణ మెజారిటీ వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. కొందరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే, మరికొందరు అసెంబ్లీ స్థానాల కోసం బరిలోకి దిగారు. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన సినిమా తారలెవరో తెలుసుకుందాం రండి.

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనతో పాటు జనసేన పార్టీకి చెందిన 21 మంది అభ్యర్థులు కూడా విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం.

కంగనా రనౌత్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గత ఐదారేళ్లుగా బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిఫలంగా ఈసారి లోక్‌సభ టిక్కెట్‌ దక్కించుకుంది. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లో కంగనా విజయం సాధించింది. కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందింది.

సురేష్ గోపి మలయాళ నటుడు సురేష్ గోపీ కేరళలో చరిత్ర సృష్టించారు. శ్రీశూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన ఘన విజయం సాధించారు. కేరళలో బీజేపీకి ఇదే మొదటి విజయం. ఈ సందర్భంగా తన విజయాన్ని మోదీకి అంకితం చేశారు సురేష్ గోపి.

రవికిషన్ ప్రముఖ భోజ్‌పురి నటుడు, రేసు గుర్రం విలన్ రవి కిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించడం ఆయనకు ఇది రెండోసారి.

మనోజ్ తివారీ భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, గాయకుడు మనోజ్ తివారీ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై విజయం సాధించారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.

అరుణ్ గోవిల్‌

ప్రముఖ సీరియల్ ‘రామాయణం’లో శ్రీరాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్‌కు ఈసారి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరుణ్ గోవిల్‌ ఘన విజయం సాధించారు.

రచనా బెనర్జీ.. పలు తెలుగు సినిమాల్లో నటించిన రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ స్థానం నుంచి టీఎంసీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీకి చెందిన లాకెట్ ఛటర్జీ పై సుమారు 60 వేల ఓట్ల తేడాతో రచనా విజయం సాధించింది.

శత్రుజ్ఞ సిన్హా గతంలో బీజేపీలో ఉన్న ప్రముఖ నటుడు శత్రుజ్ఞ సిన్హా మోదీపై విమర్శలు చేసి పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

హేమ మాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమమాలిని మరోసారి భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే ఆమె నియోజకవర్గంలో కనిపిస్తున్నారని విమర్శలున్నా మరోసారి హేమకే పట్టం కట్టారు.

పరాజితులు.. కన్నడ స్టార్ హీరో వరాజ్ కుమార్ భార్య, నిర్మాత గీతా శివరాజ్ కుమార్ షిమోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. శివన్న తన సతీమణి గీత తరపున చురుగ్గా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో గీతా శివరాజ్‌కుమార్‌కు చేదు అనుభవమే ఎదురైంది . ఆమెపై బీజేపీ అభ్యర్థి బీవై రాఘవేంద్ర భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా కూడా ఓటమి పాలయ్యారు. అలాగే మరో టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా ఓటమి పాలయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.