AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: రూటు మార్చిన గోపిచంద్.. పక్కా హిట్ అంటున్న అభిమానులు

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి, శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, పవన్ కుమార్ ప్రజెంట్స్- హిస్టారికల్ ఫిల్మ్ #గోపీచంద్33. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో గోపి చంద్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

Gopichand: రూటు మార్చిన గోపిచంద్.. పక్కా హిట్ అంటున్న అభిమానులు
Gopichand
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2025 | 8:03 AM

Share

మాచో స్టార్ గోపీచంద్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్33లో నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఒక డిజాస్టర్, రెండు హిట్స్.. దెబ్బకు బ్రేక్ తీసుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌లు, 55 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరో గోపిచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. ఇప్పటికే గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. యోధుడిలా కనిపించిన గోపిచంద్ తన పాత్రలోని ఇంటెన్స్ ని ప్రజెంట్ చేశారు.

ఇక హీరోయిన్స్ సర్దుకోవాల్సిందే..! ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ దొరికేసింది మావ.!!

విభిన్నమైన కథలతో, సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి, ఈ చిత్రంతో భారత చరిత్రలోని ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపైకి తెస్తున్నారు. అద్భుతమైన ఎమోషన్స్, విజువల్ గ్రాండ్యూర్ తో ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించబోతున్నారు. గోపిచంద్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సౌందర్ రాజన్ కెమెరామ్యాన్ కాగా అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ పక్క హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

రవితేజ, ప్రభాస్‌లతో హిట్స్.. ఆఫర్స్ తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పనుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..