AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయసు 50ఏళ్లు.. 150కి పైగా సినిమాలు.. నలుగురితో ఎఫర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్న హీరోయిన్

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే సినీరంగంలో చక్రం తిప్పిన ముద్దుగుమ్మ ఆమె. 150కి పైగా సినిమాలు చేసింది.

వయసు 50ఏళ్లు.. 150కి పైగా సినిమాలు.. నలుగురితో ఎఫర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్న హీరోయిన్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Oct 25, 2025 | 10:14 PM

Share

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? 90 వదశకంలో ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ గ్లామరస్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. ఈ అందాల తార క్రేజ్ ను చూసి స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించే వారు. తన అందం, అభినయంతో సినిమాల్లో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచింది. పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు నడిపిందంటూ ఈ బ్యూటీపై రూమర్లు వినిపించాయి.

ఇక టీమిండియా దిగ్గజ క్రికెటర్ తోనూ రిలేషన్ నడిపిందని ప్రచారం జరిగింది. ఇవి నిజమో, అబద్ధమో తెలియదు కానీ 50 ఏళ్లు వచ్చినప్పటికీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఆ హీరోయిన్ ఎవరో ఈపాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. తను మరెవరో కాదు నగ్మా. తాజాగా నగ్మా చిన్ననాటి ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇతర రంగాలతో పోలిస్తే సినిమా సెలబ్రిటీలకు చాలా క్రేజ్ ఉంటుంది. అదే సమయంలో వారి వ్యక్తిగత జీవిత విషయాలు కూడా తరచూ వార్తల్లోకి వస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

పెళ్లి సందడి సినిమాలో రాఘవేంద్ర రావు చెప్పినట్లు ‘అరేబియన్ గుర్రమంటి నలక నడుమున్న నగ్మా’ తన అందంతో 90వ దశకంలో యువతను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అదే సమయంలో ప్రేమ వ్యవహారాలతోనూ వార్తల్లో నిలిచింది. నటుడు శరత్‌ కుమార్‌, మనోజ్‌ తివారి, రవి కిషన్‌లతో పాటు క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతోనూ లవ్‌లో పడిందని ప్రచారం సాగింది. అయితే ఏ ఒక్కరితోనూ ఆమె ప్రేమ బంధం నిలబడలేకపోయిందని రూమర్లు వచ్చాయి. అయితే వీటితో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంటోంది. అయితే కాలం కలిసొస్తే మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.