AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arundhati Movie: పెళ్లి చేసుకోవడం వల్ల అరుంధతి సినిమా మిస్ అయిన హీరోయిన్.. అనుష్క కంటే ముందు ఎవరంటే..

అరుంధతి.. తెలుగు సినిమా ప్రపంచంలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ. ఈ ఒక్క మూవీ అనుష్క శెట్టి సినీ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. అందమైన రూపం... అద్భుతమైన నటనతో వెండితెరపై మాయ చేసింది అనుష్క. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా సిల్వర్ స్క్రిన్ పై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా. ?

Arundhati Movie: పెళ్లి చేసుకోవడం వల్ల అరుంధతి సినిమా మిస్ అయిన హీరోయిన్.. అనుష్క కంటే ముందు ఎవరంటే..
Arundhati
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2025 | 7:15 AM

Share

డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో అరుంధతి ఒకటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2009లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ మూవీ అనుష్క సినీ ప్రయాణానికి టర్నింగ్ పాయింట్ అయ్యింది. కేవలం రూ.13 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఇందులో జేజమ్మ.. అరుంధతి పాత్రలో అనుష్క అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. అనుష్క అందమైన రూపం.. సహజ నటన జనాలను కట్టిపడేసింది.అరుంధతి సినిమాతో తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమాను మిస్ అయిన హీరోయిన్ మరొకరు ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

అరుంధతి సినిమాను తెరకెక్కించే సమయంలో ముగ్గురు హీరోయిన్స్ పేర్లు ఉన్నాయట. అందులో ముందుగా మలయాళ హీరోయిన్ మమతా మోహన్ దాస్.. ఆ తర్వాత నటి ప్రేమ, అలాగే బాలనటి నుంచి హీరోయిన్ గా మారిన రాశీ పేర్లు ఉన్నాయి. మమతా మోహన్ దాస్ ను కోడి రామకృష్ణ వ్యక్తిగతంగా సంప్రదించినప్పటికీ ఆమె ఈ సినిమాను వదులుకున్నారు. మరో హీరోయిన్ ప్రేమ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సినిమాను వదులుకున్నారు. అయితే మమతా మోహన్ దాస్ కాకుండా మరో హీరోయిన్ సైతం ఈ సినిమా ఛాన్స్ మిస్ అయ్యారట. కేవలం పెళ్లి చేసుకోవడం వల్లే అరుంధతి మూవీ ఛాన్స్ మిస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ రాశి.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి.. తన సినిమా ప్రయాణం, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అరుంధతి సినిమాలో అనుష్క చేసిన జేజమ్మ పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని… ఆ పాత్ర చేస్తే బాగుండేది అని అనిపించిందని అన్నారు. ఆ సినిమాకు నాకు ఏదైనా ఛాన్స్ ఉండేదా అని డైరెక్టర్ కోడి రామకృష్ణ గారిని అడగ్గానే.. నిన్ను ఎవరు త్వరగా పెళ్లి చేసుకోమన్నారు.. ?నీ పెళ్లే కారణం అని అన్నారని గుర్తు చేసుకుంది రాశి. బాలనటిగా తెరంగేట్రం చేసిన రాశి కథానాయికగా ఎన్నో చిత్రాల్లో అలరించిన సంగతి తెలిసిందే. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు, సీరియల్స్ చేస్తున్నారు.

Rashi

Rashi

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..