Ajmal Ameer: అడిషన్ అని పిలిచి గదిలో అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆ హీరో దుర్మార్గుడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
తమిళ హీరో అజ్మల్ అమీర్ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల అతడు అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరలవుతుంది. అందులో హద్దులు దాటి సంభాషించాడంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే అజ్మల్ మాత్రం తనకు గురించి వార్తలన్నీ అవాస్తవమని.. ఏఐ వీడియోతో తన కెరీర్ నాశనం చేస్తున్నారని అన్నాడు.

తమిళ్ హీరో అజ్మల్ అమీర్ గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత రచ్చ సినిమాలో కీలకపాత్రలో నటించాడు. కొన్ని రోజులుగా తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా అజ్మల్ అమీర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అతడు కొందరు అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరలవుతుంది. అందులో అమ్మాయిలతో హద్దులు దాటి మాట్లాడాడంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే తన గురించి వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. ఏఐ వీడియోతో తన కెరీర్ నాశనం చేస్తున్నారని అన్నారు అజ్మల్. ఈ క్రమంలోనే తాజాగా అజ్మల్ పై తమిళ్ హీరోయిన్ నర్విని దేరి సంచలన కామెంట్స్ చేసింది. అజ్మల్ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయని తెలిపింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నర్విన్ మాట్లాడుతూ.. “అజ్మల్ అమీర్‌పై వ్యతిరేకంగా మాట్లాడిన మొదటి వ్యక్తిని నేనే కావచ్చు. నా స్నేహితుడికి ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్వ్యూలో అజ్మల్ అమీర్ దురాగతాల గురించి నేను గతంలో వెల్లడించాను. 2018లో నేను ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు చెన్నైలోని ఒక మాల్‌లో అజ్మల్ అమీర్‌ను మొదటిసారి కలిశాను. నాకు అజ్మల్‌తో అంతగా పరిచయం లేదు.నా స్నేహితుడి ద్వారా అతడితో పరిచయం ఏర్పడింది. అజ్మల్ అప్పుడు తన నెక్ట్స్ సినిమాకు హీరోయిన్ వెతుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత మేము మాట్లాడుకున్నాము. మా నంబర్స్ మార్చుకున్నాము. ఆ తర్వాత ఒకరోజు అజ్మల్ నన్ను ఆడిషన్ కోసం పిలిచాడు. కానీ నేను మరుసటి రోజు డెన్మార్క్ వెళ్తున్నాను కాబట్టి రాలేనని చెప్పాను. అజ్మల్ వెంటనే వచ్చి టీమ్ ని కలవగలనని చెప్పాడు. ఆడిషన్, నిర్ణయం ఒకే రోజు ఎలా జరుగుతుందని అజ్మల్ ని అడిగాను. నేను చూసుకుంటానని అన్నాడు. దీంతో నేను అడిషన్ కోసం వెళ్లాను. నేను ఆడిషన్ కి వెళ్ళినప్పుడు, నా స్నేహితులు లేదా బంధువులు నాతో ఉంటారు. ఆ రోజు, అలా జరగలేదు. అజ్మల్ తెలిసిన వ్యక్తి కావడంతో నేను అంతగా భయపడలేదు.
అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లగానే నాకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. తలుపు తట్టగానే అజ్మల్ తలుపు తీశాడు. అక్కడ ఎవరు లేకపోవడంతో అడిగాను. వారంతా బయటకు వెళ్లారు అని చెప్పాడు. గదిలోకి వెళ్లగానే అతడు ఆహారం ఇచ్చాడు. కానీ నేను వద్దు అన్నాను. 20 నిమిషాల్లో మెసేజ్ చేయకపోతే నాకు ఫోన్ చేయమని నా స్నేహితుడికి సందేశం పంపాను. ఆ తర్వాత కాసేపు వాష్ రూంలోనే గడిపాను. నేను బయటకు రాగానే, అతను మ్యూజిక్ ఆన్ చేసి నా చేయి పట్టుకున్నాడు. మనం డ్యాన్స్ చేద్దామని చెప్పాడు. దీంతో అతడిని దూరంగా నెట్టాను. “నీ ఉద్దేశ్యం నాకు అర్థమైంది, కానీ నేను దానికోసం రాలేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను అందంగా ఉన్నాను, ఎంతమంది అమ్మాయిలు నా వెంటపడతారో నీకు తెలుసా.. ? అని అన్నాడు. అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు రూం బాయ్ వచ్చి డోర్ తీయగానే వెంటనే అక్కడి నుంచి పారిపోయాను. ఆ ఘటన తర్వాత కూడా అతడు నాకు మెసేజ్ చేశాడు. నేను నా చదువు, కెరీర్ గురించి ఆలోచించాను. అందుకే కేసు పెట్టలేదు” అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..




