Baahubali The Epic Movie: బాహుబలి : ది ఎపిక్ సినిమా పై ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు కొడుకు.. ఏం అన్నారంటే.
భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి మూవీ ఓ చరిత్ర. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఆ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

బాహుబలి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. బాహుబలి 1, బాహుబలి 2 సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఆయన హీరోగా తెరకెక్కించిన ఈ రెండు భాగాలు థియేటర్లలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఆ రెండు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ రెండు భాగాలను లిపి బాహుబలి : ది ఎపిక్ పేరుతో శుక్రవారం (అక్టోబర్ 31న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో రానా, ప్రభాస్, రాజమౌళి పాల్గొంటున్నారు. ఇక విడుదలకు ఒకరోజు ముందుగాగనే ఇంటర్నేషనల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ ఈ చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.
ఓవర్సీస్ లో బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రీమియర్ షో చూసిన గౌతమ్ ఘట్టమనేని టీవీ9తో మాట్లాడుతూ.. బాహుబలి ది ఎపిక్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ లో బాహుబలి ది ఎపిక్ సినిమాను చూడడం ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్ పీరియన్స్ అని.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేనది.. సినిమా అద్భుతంగా ఉందని.. తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంతటి ఆదరణ దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు .. ఇప్పుడు రెండు భాగాలను ఒకేసారి చూడడం గ్రేటెస్ట్ ఫీలింగ్ అని చెప్పాలని.. ఇదొక ఎపిక్ సినిమా అని.. ప్రతి సెకనుకు గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయని.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని.. బిగ్ స్క్రీన్ పై చూడడం క్రేజీ ఫీలింగ్ అని అన్నారు గౌతమ్.
ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 వర్కింగ్ టైటిల్ పేరుతో వస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాక్టింగ్ స్కూ్ల్లో చేరి నటనలో మెలకువలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
Super star #MaheshBabu Son #GauthamGhattamaneni About #BaahubaliTheEpic#Prabhas #SSRajamouli #AnuskhaShettypic.twitter.com/rVHWBGOoxx
— Milagro Movies (@MilagroMovies) October 30, 2025
ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..




