Singer Mangli: చీరకట్టులో త్రో బాల్ ఆడిన సింగర్ మంగ్లీ.. వీడియో ఇదిగో

ఓ ప్రముఖ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ తన యాస, భాషతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టి బిజీ సింగర్ గా మారిపోయింది. అలాగే టీవీ షోస్, ప్రైవేట్ సాంగ్స్, ఈవెంట్లు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

Singer Mangli: చీరకట్టులో త్రో బాల్ ఆడిన సింగర్ మంగ్లీ.. వీడియో ఇదిగో
Singer Mangli
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2024 | 3:58 PM

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు బిజి బిజీగా ఉంటోంది. ఓవైపు తెలుగు సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు టీవీ షోస్ లోనూ సందడి చేస్తోంది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. బయటి ఈవెంట్లలోనూ పాల్గొంటూ బిజి బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె ఈషా గ్రామోత్సవం 2024 కార్యక్రమంలో పాల్గొంది. ఈషా ఫౌండేషన్‌ 2004 నుంచి గ్రామోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.ఇప్పటివరకు సుమారు 30 వేల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారట. గ్రామాల్లో ఆటలు, పాటలతో వినోద కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే అంతరించిపోతున్న సంప్రదాయ కళలు, ఆచారాలను మళ్లీ గుర్తు చేసే విధంగా ఈషా గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలా తాజాగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ కూడా హాజరైంది. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలతో కలిసి సరదాగా త్రో బాల్ గేమ్ ఆడింది.

ఇవి కూడా చదవండి

చీరకట్టుకొని ఫుల్ ఎనర్జీ తో స్కూల్ పిల్లలకి పోటీగా త్రోబాల్  వివిసిరింది మంగ్లీ. అక్కడున్న జనాలు ఆమె ఆటను చూసి ఆశ్చర్యపోయారు. సింగర్ మంగ్లీతో పాటు ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి కూడా ఈ గేమ్ లో చీర కట్టుకుని పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇషా గ్రామోత్సవంలో సింగర్ మంగ్లీ.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by @telanganathrowballofficial

కాగా సింగర్ మంగ్లీ ఇటీవలే ఓ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకుంది. సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గుర్తింపుగా సంగీత నాటక అకాడమీ ఆమెను ‘ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌’ యువ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అతిరథ మహారధుల సమక్షంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్‌ను సింగర్ మంగ్లీ అందుకుంది.

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారంతో సింగర్ మంగ్లీ…

View this post on Instagram

A post shared by Mangli (@iammangli)

సింగర్ మంగ్లీ లేటెస్ట్ ఆల్బమ్ సాంగ్..

View this post on Instagram

A post shared by Mangli (@iammangli)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.