- Telugu News Photo Gallery Cinema photos Sreeleela's place is safe in Devi Sri Prasad hit list and what is the story of the hit list?
DSP Heroines: దేవీ హిట్ లిస్టులో శ్రీలీల సేఫ్.. ఇంతకీ హిట్ లిస్టు కహానీ ఏంటి.?
నేనెప్పుడూ లేట్ కాదు.. నేను ఆన్ టైమ్ అంటూ పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో ఓపెన్‌గా అన్నీ విషయాలు మాట్లాడేశారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఎన్ని స్టేట్‌మెంట్స్ ఇచ్చినా.. గ్లామర్ లవర్స్ కి మాత్రం ఆ ఒక్క విషయం చాలా బాగా నచ్చింది. దేవీ హిట్ లిస్టులో శ్రీలీల ప్లేస్ సేఫ్ అంటూ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ హిట్ లిస్టు కహానీ ఏంటో... అర్థమైందిగా...
Updated on: Dec 02, 2024 | 4:10 PM

నేనెప్పుడూ లేట్ కాదు.. నేను ఆన్ టైమ్ అంటూ పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో ఓపెన్‌గా అన్నీ విషయాలు మాట్లాడేశారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఎన్ని స్టేట్‌మెంట్స్ ఇచ్చినా.. గ్లామర్ లవర్స్ కి మాత్రం ఆ ఒక్క విషయం చాలా బాగా నచ్చింది. దేవీ హిట్ లిస్టులో శ్రీలీల ప్లేస్ సేఫ్ అంటూ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ హిట్ లిస్టు కహానీ ఏంటో... అర్థమైందిగా...

విన్నారుగా అదీ సంగతి... దేవిశ్రీ బీట్‌లోనే స్పెషల్ సాంగుల కేటగిరీలో ఫస్ట్ స్టెప్ వేశారు శ్రీలీల. కిస్సిక్ సాంగ్‌లో బన్నీ ఎనర్జీకి ధీటుగా స్టెప్పులేసి పర్ఫెక్ట్ సెలక్షన్ అనిపించుకున్నారు. ఈ సంక్రాంతి తర్వాత తనను మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు ఈ బ్యూటీ.

ఇప్పుడు శ్రీలీల మాత్రమే కాదు.. గతంలో సమంత స్పెషల్‌గా స్టెప్పులేసిన ఉ అంటావా సాంగ్‌కి కూడా మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. పుష్ప రిలీజ్ టైమ్‌లో ఉ అంటావా సాంగ్ తెచ్చిన ఊపు గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాలా చెప్పండి... అలా సమంత స్పెషల్ సాంగ్ ఎంట్రీకి తన ట్యూన్‌తో ఫస్ట్ ఊ అన్నది కూడా దేవిశ్రీనే

రామ్‌చరణ్ నటించిన రంగస్థలంలో జిగేలు రాణిగా కేక పుట్టించేశారు పూజా హెగ్గే. సుకు - దేవిశ్రీ కాంబోలో వచ్చే స్పెషల్ సాంగుకు పూజా యాడ్ కావడం అప్పట్లో పెద్ద సెన్సేషన్. అలా పూజా స్పెషల్ ఎంట్రీ కూడా తన ట్యూన్‌తోనే అని ఓపెన్‌గా అనౌన్స్ చేశారు దేవిశ్రీ

వీళ్లే కాదు.. వీళ్లందరి కన్నా ముందే కాజల్‌తో పక్కా లోకల్ అనిపించింది కూడా దేవిశ్రీ ప్రసాద్‌దే. హీరోయిన్లు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయాలను చాలా సార్లు చెప్పుకున్నా.. దేవిశ్రీ ప్రసాద్ మెన్షన్ చేసేవరకూ ఈ యాంగిల్‌ని ఆలోచించలేకపోయామే అని డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు.