Pushpa 2: పుష్ప ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో ఎవరి పర్సెంటేజ్ ఎంత..?
కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. పబ్లిసిటీ స్పీడందుకుంది.. పాటల విడుదల వేడుకకు వేళవుతోంది. మాట్లాడుకోవడానికి ఇన్ని విషయాలున్నా.. అందరినీ అట్రాక్ట్ చేస్తున్నది మాత్రం ఒక్కటే... పుష్ప ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో ఎవరి పర్సెంటేజ్ ఎంత..? జాతర బ్లాక్‌కి మ్యూజిక్ ఇస్తున్నదెవరు?
పుష్ప ట్రైలర్‌లో ప్రతి సింగిల్ షాట్‌కీ సంగీతం అందించినందుకు చాలా సంతోషిస్తున్నాను అంటూ దేవిశ్రీ ప్రసాద్ పెట్టిన పోస్టు వైల్డ్ ఫైర్‌లా స్ప్రెడ్ అవుతోంది. ట్రైలర్ మ్యూజిక్ బాగానే ఉంది కదా.. మరి తమన్ అండ్ అదర్స్‌తో ఏం చేయిస్తున్నారనే టాక్ ఊపందుకుంది.
పుష్ప2 ని చాలా వరకు చూశాను. భారీ ప్రాజెక్ట్. నేను సినిమా మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం లేదు. జస్ట్ కొన్ని బ్లాక్స్‌ని మాత్రమే ఒప్పుకున్నాను అని జెన్యూన్‌గా చెప్పేశారు తమన్. ఇంతకీ తమన్ బీజీ స్కోర్ చేస్తున్న ఎపిసోడ్స్ ఏవనేది ఊరిస్తున్న విషయం.
తమన్ మాత్రమే కాదు.. మరికొంత మంది మ్యూజిక్ డైరక్టర్ల చేతిలోనూ పుష్ప2 ఉందన్నది వైరల్ న్యూస్. అవన్నీ కంప్లీట్ అయి వచ్చాక… ఓ సారి శ్రద్ధగా చూస్తారట సుకుమార్. ఆ తర్వాతే దేన్ని ఫైనల్‌గా కన్సిడర్ చేయాలి? దేవిశ్రీ స్కోర్‌ని ఎంత వరకు ఉంచాలి.. అనే విషయాల మీద ఫైనల్ కాల్ తీసుకుంటారట. సో… రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ విషయం మీద ఇంట్రస్ట్ అమాంతం పెరుగుతోంది.
డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు . తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప 2 ఈవెంట్స్ నిర్వహించారు. ముంబై, కొచ్చి, చెన్నై, పట్నాలో పుష్ప 2 స్పెషల్ ఈవెంట్స్ జరిగాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.