Kalvakuntla Kavitha: రామ్ చరణ్ గొప్ప డ్యాన్సరే కావొచ్చు.. కానీ.. తన ఫేవరేట్ హీరో ఎవరో చెప్పేసిన కవిత
నిత్యం ప్రజల్లో తిరుగుతోన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా #AskKavitha అంటూ ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఇదే సందర్భంగా ఒక నెటిజన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడూ అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. అలాగే తీరిక దొరికనప్పుడు సరదాగా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిస్తుంటారు. అలా సోమవారం (డిసెంబర్ 15) కూడా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు కవిత. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. చాలా మంది నెటిజన్లు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలనే అడగ్గా.. ఒక నెటిజన్ మాత్రం డిఫరెంట్ గా రామ్ చరణ్ గురించి అడిగాడు. మెగా పవర్ స్టార్ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు? అని కవితను అడిగాడు. దీనికి స్పందించిన ఆమె ‘ రామ్ చరణ్ మంచి వ్యక్తి. గొప్ప డాన్సర్ కూడా.. అయితే.. నేను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. అందుకే రామ్ చరణ్ కంటే చిరంజీవి అంటేనే ఎక్కువ ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కవిత కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మెగాభిమానులు కవిత ట్వీట్ ను బాగా వైరల్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చికిరి సాంగ్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.
నెటిజన్ ప్రశ్నకు కవిత ఆన్సర్ ఇలా..
Personally very Humble. Great dancer .. but I am a Chiru fan .. so not greater than Chiranjeevi Garu 🙂 https://t.co/L09sN5H5Du
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








