Samantha: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సమంత ?.. ఇమ్యూనిటీతో ఎన్నో బెనిఫిట్స్ అంటోన్న సామ్..
మొన్నటివరకు బాలీలో సందడి చేసిన సామ్.. ఇప్పుడు అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్, మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా సమంత మరోసారి ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్ పై నుంచి సెలైన్ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇమ్యూనిటీ బూస్ట్ వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించిన వివరాలను ఆమె పంచుకున్నారు.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సామ్ మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు అమెరికాకు వెళ్లిందని టాక్ వినిపించింది. అయితే చికిత్స తీసుకోవడానికి ముందు ఆమె మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు తనకు నచ్చిన ప్రదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటివరకు బాలీలో సందడి చేసిన సామ్.. ఇప్పుడు అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్, మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా సమంత మరోసారి ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్ పై నుంచి సెలైన్ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇమ్యూనిటీ బూస్ట్ వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించిన వివరాలను ఆమె పంచుకున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వలన.. శరీరానికి హాని కలిగించే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, ఇతర వాటితో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యమంటూ సెలైన్ ఫోటోపై రాసుకొచ్చారు సామ్. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకోవడానికి సామ్ మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సామ్ కొన్ని నెలలుగా నటనకు విరామం ఇచ్చి.. తన ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ప్రయాణాలు చేస్తూనే ఉంది. ఆమె విరామ సమయంలో కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లో ధ్యానం చేసిన ఫోటోస్ వైరల్ అయ్యాయి. ఇక ఆ తర్వాత అమెరికా వెళ్లే ముందు ఆమె తన స్నేహితురాలితో కలిసి బాలికి వెళ్లింది. గత ఏడాది మైయోసైటిస్‌తో తన పోరాటం గురించి సమంత సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది.అలాగే ఆమెకు ఆటో-ఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతోంది.
View this post on Instagram
సమంత చివరిసారిగా ఖుషి చిత్రంలో నటించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. అలాగే ఆమె నటించిన సిటాడెల్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో వరుణ్ దావన్ హీరోగా నటించారు. ఈ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్, గన్స్ అండ్ గులాబ్స్ వంటి వెబ్ సిరీస్ లను నిర్మించిన రాజ్ అండ్ డీకే రూపొందించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.