ప్రముఖ నటి శ్రీయా శరణ్ తన తల్లి నీరజ, కుమార్తె రాధా శరణ్ లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్న శ్రియా, ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. మాడ వీధుల్లో శ్రీయాను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.