AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: జస్ట్ 99.. కోహ్లీ 9 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేందుకు అభిషేక్ శర్మ సిద్ధం..!

IND vs SA: ఈ ఏడాది టీమిండియాకు ఇంకా 4 టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నాలుగు ఇన్నింగ్స్‌లలో అభిషేక్ శర్మ గనుక 99 పరుగులు చేయగలిగితే, ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

IND vs SA: జస్ట్ 99.. కోహ్లీ 9 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేందుకు అభిషేక్ శర్మ సిద్ధం..!
Abhishek Sharma
Venkata Chari
|

Updated on: Dec 11, 2025 | 7:39 AM

Share

Abhishek Sharma: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. కటక్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతను కేవలం 17 పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ, రాబోయే మ్యాచ్‌లలో ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం అతనికి ఉంది.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 9 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టడానికి అభిషేక్ శర్మకు కేవలం 99 పరుగులు మాత్రమే అవసరం.

ఏమిటీ ఈ రికార్డు?

  • ఒక క్యాలెండర్ ఇయర్‌లో (ఒకే ఏడాదిలో) టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.
  • విరాట్ కోహ్లీ రికార్డు: 2016లో విరాట్ కోహ్లీ 29 ఇన్నింగ్స్‌లలో మొత్తం 1614 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఏ భారతీయ బ్యాటర్ కూడా ఒకే ఏడాదిలో ఇన్ని పరుగులు చేయలేకపోయాడు.

ఇది కూడా చదవండి: ఎవర్రా సామీ నువ్వు.. 23 ఫోర్లు, 18 సిక్సర్లు.. 56 బంతుల్లో 219 పరుగులు.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

అభిషేక్ శర్మ ప్రస్తుత గణాంకాలు:

  1. 2025 సంవత్సరంలో అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
  2. అతను ఇప్పటివరకు 37 ఇన్నింగ్స్‌లలో 1516 పరుగులు చేశాడు.
  3. విరాట్ కోహ్లీ రికార్డు (1614)ను అధిగమించడానికి అభిషేక్ శర్మకు ఇంకా 99 పరుగులు అవసరం.

చేతిలో ఇంకా 4 మ్యాచ్‌లు:

ఈ ఏడాది టీమిండియాకు ఇంకా 4 టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నాలుగు ఇన్నింగ్స్‌లలో అభిషేక్ శర్మ గనుక 99 పరుగులు చేయగలిగితే, ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

ఇది కూడా చదవండి: Tilak Varma: కటక్ టీ20లో తెలుగబ్బాయ్ చారిత్రాత్మక రికార్డ్.. ఆ లిస్ట్‌లో తొలి భారతీయుడిగా..

ముఖ్యంగా, డిసెంబర్ 11న చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ అభిషేక్ శర్మకు చాలా కీలకం. ఎందుకంటే ఇది అతనికి సొంత మైదానం. కాబట్టి, అక్కడ భారీ స్కోరు సాధించి ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.