ఎవర్రా సామీ నువ్వు.. 23 ఫోర్లు, 18 సిక్సర్లు.. 56 బంతుల్లో 219 పరుగులు.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
Sagar Kulkarni: టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే, ఈ ఫార్మాట్‌లో, ప్రతి జట్టు ఇన్నింగ్స్‌కు 120 బంతులకే పరిమితం చేసింది. 20 ఓవర్ల ఇన్నింగ్స్‌లో పరిమిత సంఖ్యలో బంతులు ఉండటం వల్ల, బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ సాధించే అవకాశం దాదాపుగా ఉండదు.

Sagar Kulkarni: సాధారణంగా వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ (200 పరుగులు) చేయడం చాలా కష్టమైన విషయం. అలాంటిది కేవలం 120 బంతులు మాత్రమే ఉండే టీ20 ఫార్మాట్‌లో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ చేయడం అసాధ్యమని చాలా మంది భావిస్తారు. కానీ, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఒక క్రికెటర్. అతనే సింగపూర్‌కు చెందిన సాగర్ కులకర్ణి.
విధ్వంసకర ఇన్నింగ్స్..
సాగర్ కులకర్ణి బ్యాటింగ్ విన్యాసంతో మైదానంలో పరుగుల వరద పారింది. కేవలం 56 బంతుల్లోనే 219 పరుగులు చేసి, టీ20 చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అతని ఈ ఇన్నింగ్స్ కారణంగా మెరీనా క్లబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 368 పరుగులు చేసింది. సాగర్ కులకర్ణికి తోడుగా మరో ఎండ్లో ఉన్న ములేవా ధర్మిచంద్ కూడా 44 బంతుల్లో 89 పరుగులు చేశాడు.
2008లో జరిగిన ఒక ఇంటర్-క్లబ్ టీ20 మ్యాచ్‌లో మెరీనా క్లబ్ (Marina Club) తరపున ఆడుతూ సాగర్ కులకర్ణి ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు.
పరుగులు: 219 (నాటౌట్)
బంతులు: 56
ఫోర్లు: 23
సిక్సర్లు: 18
రికార్డులు..
సాగర్ కులకర్ణి తర్వాత మరికొందరు క్రికెటర్లు కూడా వివిధ టీ20 లీగ్స్, క్లబ్ స్థాయి మ్యాచ్‌లలో డబుల్ సెంచరీలు సాధించారు.
సుబోధ్ భాటి: 2021లో ఢిల్లీకి చెందిన ఈ ఆటగాడు క్లబ్ మ్యాచ్‌లో 79 బంతుల్లో 205 పరుగులు చేశాడు.
రహకీమ్ కార్న్‌వాల్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ 2022లో అమెరికాలో జరిగిన ఒక లీగ్‌లో 77 బంతుల్లో 205 పరుగులు సాధించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు ఎవరూ డబుల్ సెంచరీ చేయలేదు. కానీ, క్లబ్ స్థాయి క్రికెట్‌లో సాగర్ కులకర్ణి సృష్టించిన ఈ విధ్వంసం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








