Team India: జైస్వాల్ సెంచరీతో ఆ ఇద్దరు ఓపెనర్ల కెరీర్ క్లోజ్.. ఇకపై భారత జట్టులోకి రావడం కష్టమే.?
Yashasvi Jaiswal Century in IND vs SA 2rd ODI: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ సెంచరీ చేయడంతో.. ఇద్దరు భారత ఓపెనర్ల కెరీర్‌ను ముగించాడు. ఈ ఇద్దరు ఇకపై వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలను దాదాపుగా నాశనం చేసిందని భావిస్తున్నారు.

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకంతో చెలరేగారు. అయితే, ఆయన ఈ ఇన్నింగ్స్‌తో రికార్డులు సృష్టించడమే కాకుండా, మరో ఇద్దరు భారత ఓపెనర్ల కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశారన్న చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మొదలైంది.
చరిత్ర సృష్టించిన యశస్వి విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ 116 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు 2-1తో సిరీస్ విజయాన్ని అందించారు. ఈ సెంచరీతో మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీ చేసిన ఆరో భారతీయ క్రికెటర్‌గా యశస్వి రికార్డు సృష్టించారు. సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సరసన యశస్వి చేరారు.
ఆ ఇద్దరు ఓపెనర్ల కెరీర్‌కు ముప్పు?..
యశస్వి జైస్వాల్ అద్భుత ఫామ్, నిలకడ కారణంగా సెలెక్టర్లు అతన్ని దీర్ఘకాలిక ఓపెనర్‌గా భావిస్తున్నారు. దీంతో మరో ఇద్దరు ప్రతిభావంతులైన ఓపెనర్లు – సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్ – మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా మారింది.
సాయి సుదర్శన్: 2023లో దక్షిణాఫ్రికాపై మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో 127 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.
ఇషాన్ కిషన్: 27 వన్డేల్లో ఒక డబుల్ సెంచరీతో సహా 933 పరుగులు చేశారు. ఆయన సగటు 42.40గా ఉంది.
వీరిద్దరూ మంచి రికార్డులు కలిగి ఉన్నప్పటికీ, యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఫామ్ వారిని వెనక్కి నెట్టేసింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇప్పుడు యశస్వి జైస్వాల్ వంటి బలమైన ఓపెనర్లు ఉండటంతో, సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్‌లకు తుది జట్టులో చోటు దక్కడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.
మొత్తానికి, యశస్వి జైస్వాల్ తన బ్యాట్‌తో కేవలం పరుగులే కాదు, జట్టులో తన స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నారు. కానీ ఇది పరోక్షంగా ఇతర యువ ఓపెనర్లకు మాత్రం గట్టి పోటీని సృష్టించింది.




