IPL 2026 Auction : ఐపీఎల్ మెగా వేలంలో ఊహించని ట్విస్ట్..1355 మంది కాదు, 350 మందికే అదృష్టం..ఫైనల్ లిస్ట్ రిలీజ్
IPL 2026 Auction : ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈసారి మొత్తం 1355 మంది ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే బీసీసీఐ ఫ్రాంచైజీలతో చర్చించి, వారి అవసరాలకు అనుగుణంగా ఆ లిస్ట్‌ను భారీగా కుదించింది.

IPL 2026 Auction : ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈసారి మొత్తం 1355 మంది ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే బీసీసీఐ ఫ్రాంచైజీలతో చర్చించి, వారి అవసరాలకు అనుగుణంగా ఆ లిస్ట్‌ను భారీగా కుదించింది. చివరికి 1005 మంది ఆటగాళ్లను తొలగించి, కేవలం 350 మందితో కూడిన ఫైనల్ జాబితాను మాత్రమే వేలానికి సిద్ధం చేసింది. దీంతో చాలా మంది ఆటగాళ్ల అదృష్టం ఈసారి తలుపు తట్టే అవకాశం లేకుండా పోయింది.
వేలం కోసం షార్ట్‌లిస్ట్ చేసిన 350 మంది ఆటగాళ్లలో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండటం ఈసారి వేలంలో అతిపెద్ద ట్విస్ట్. వీరందరూ మొదట్లో ప్రకటించిన లిస్ట్‌లో లేరు. ఈ 35 మంది కొత్త ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకే డికాక్ సహా ఈ 35 మందికి ఫైనల్ లిస్ట్‌లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. డకక్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ల కేటగిరీలో మూడవ లాట్‌లో స్థానం కల్పించారు.
క్వింటన్ డికాక్ ఐపీఎల్ 2026 వేలం కోసం తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. గతంలో ఎంత ఉన్నా, ఈసారి అతను తన బేస్ ధరను కేవలం రూ.కోటిగా నిర్ణయించుకోవడం విశేషం. ఈ 35 మంది కొత్త ఆటగాళ్లలో డికాక్‌తో పాటు, శ్రీలంక క్రికెటర్లు అయిన త్రివీన్ మాథ్యూ, బినూరా ఫెర్నాండో, కుసాల్ పెరీరా, డ్యూనిత్ వెలాలగే వంటి ప్రముఖ ఆటగాళ్ల పేర్లు కూడా చేరాయి. ఈ ఆటగాళ్ల చేరికతో వేలం మరింత ఆసక్తికరంగా మారనుంది.
ఐపీఎల్ 2026 వేలం అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో జరుగుతుంది. డిసెంబర్ 16న, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం ప్రారంభమవుతుంది. బీసీసీఐ పంపిన మెయిల్ ప్రకారం.. వేలం మొదట క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన) ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై బిడ్లు వేస్తారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




