తిరుపతి నుండి షిర్డీకి కొత్త రైలు సేవలు ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా షిర్డీకి, షిర్డీ నుండి ప్రతి సోమవారం తిరుపతికి అందుబాటులో ఉంటుంది.