Telangana Panchayat Elections 2025 Live: కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం కౌంటింగ్..
Telangana Gram Panchayat Polls 2025 Phase 1 Live Updates in Telugu: సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తొలి విడతలో 189 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది పోటీ పడుతుండగా.. 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

LIVE NEWS & UPDATES
-
మెదక్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
- ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల హోరు
- పోలింగ్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం
- భారీ బందోబస్తు నడుమ సాగుతున్న పోలింగ్
- 420 సర్పంచ్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు
- ఇప్పటికే 39 గ్రామాల్లో ఏకగ్రీవం
-
కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
- ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్
- జిల్లాలో 398 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
- ఇప్పటికే 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
- 373 స్థానాలకు పోలింగ్ ప్రారంభం
- మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్
- సాయంత్రం వెలువడనున్న ఫలితాలు
-
-
ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్..
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైన పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 317 పంచాయతీలకు ఎన్నికలు
- ఖమ్మం జిల్లాలో 172 గ్రామ పంచాయతీలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 పంచాయతీలకు ఎన్నికలు
- మొత్తం 3,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు
- 570 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాల పహారా
-
నల్గొండ జిల్లాలో 585 గ్రామాల్లో పోలింగ్
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో 28 మండలాల్లో తొలి విడత ఎన్నికలు
- 585 సర్పంచ్ స్థానాలు, 4,776 వార్డులకు పోలింగ్
- బరిలో 1,836 సర్పంచ్ అభ్యర్థులు, వార్డు స్థానాలకు 11,281మంది అభ్యర్థులు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 8లక్షల 54వేల 530 మంది
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6వేల మంది పోలీసులతో బందోబస్తు
-
వరంగల్‌లో 503 గ్రామాల్లో పోలింగ్
-
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదలైన పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 503 సర్పంచ్ స్థానాలకు పోలింగ్
- 555 సర్పంచ్ స్థానాల్లో 52 స్థానాలు ఏకగ్రీవం
- బరిలో 1,784 మంది సర్పంచ్ అభ్యర్థులు
- 3,796 వార్డు స్థానాలకు బరిలో నిలిచిన 9,250 మంది అభ్యర్థులు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4వేల మంది పోలీసులతో బందోబస్త
-
-
-
ఆదిలాబాద్ జిల్లాలో 506 గ్రామాల్లో పోలింగ్..
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదలైన పోలింగ్
- 506 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
- ఇప్పటికే 62 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
- 439 పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికలు
- బరిలో 1600 మంది సర్పంచ్ అభ్యర్థులు
రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో 189 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. అదేవిధంగా 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది పోటీ పడుతుండగా.. 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఓట్ల లెక్కింపు..
మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెంటనే వెల్లడిస్తారు. సాయంత్రంలోపే ఉప సర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు
Published On - Dec 11,2025 7:01 AM
