- Telugu News Photo Gallery Chanakya Niti for Happy Marriage: 5 Qualities Men Must Look for in a Woman to Attract Luck and Prosperity
Chanakya Niti: ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అదృష్టం మీ జేబులో పెట్టుకున్నట్లే.. చాణక్యుడు ఏం చెప్పాడంటే..?
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక అంశాల గురించి వివరించారు. ముఖ్యంగా ఒక కుటుంబం సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలంటే పురుషులు ఎలాంటి స్త్రీని వివాహం చేసుకోవాలనే విషయంపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఎందుకంటే ఇంటిని నడిపించడంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడం అదృష్టంగా చెబుతారు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 10, 2025 | 8:58 PM

సహనం - శాంత స్వభావం: చాణక్యుడి ప్రకారం, ప్రశాంత స్వభావం కలిగిన స్త్రీలు లక్ష్మీ స్వరూపులు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వీరు కోపం తెచ్చుకోకుండా పరిస్థితిని చక్కగా నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటారు. కష్ట సమయాల్లో వీరు తమ భర్తకు, కుటుంబానికి అండగా నిలబడతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తారు.

విద్యావంతులు - సంస్కారవంతులు: విద్యావంతులు, సంస్కారవంతులు, మంచి మర్యాదగల స్త్రీలు తమ కుటుంబాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోగలరని చాణక్యుడు తెలిపాడు. వీరు మంచి చెడులను వివేకంతో తెలుసుకుని, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తమ భర్తలకు భారంగా ఉండకుండా కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మృదువైన వ్యక్తిత్వం: కుటుంబంలో ఆనందం ఉండాలంటే స్త్రీ యొక్క మాటతీరు చాలా ముఖ్యం. ఎప్పుడూ మృదువుగా, కోపగించుకోకుండా తియ్యగా మాట్లాడే స్త్రీలు తమ కుటుంబ సభ్యులను ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు. వీరి మధుర భాష ఇంటి ఆనందాన్ని, సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది.

డబ్బు ఆదా చేసే సామర్థ్యం: కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, అనవసర ఖర్చులను నివారించడం ద్వారా డబ్బు ఆదా చేసే సామర్థ్యం ఉన్న మహిళలు అదృష్టవంతులని చాణక్యుడు చెబుతున్నాడు. వీరు అనవసర ఖర్చులు చేయకుండా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తారు. ఎటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా, వీరి పొదుపు కారణంగా కుటుంబాన్ని సులభంగా రక్షించగలుగుతారు.

అందరినీ గౌరవించే గుణం: కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ గౌరవించే గుణం స్త్రీకి ఉండటం అత్యంత అవసరం. ఇంటి పెద్దలను, అతిథులను గౌరవించడం, గౌరవంగా చూసుకోవడం స్త్రీకి ఉండవలసిన ప్రధాన లక్షణం. అందరినీ గౌరవించే స్త్రీ కుటుంబాన్ని ఎటువంటి హాని లేకుండా నడిపిస్తుంది.




