Mass Jathara Trailer: రవితేజ ‘మాస్ జాతర’ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పక్కా..
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జాతర' సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. అక్టోబర్ 31న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం మాస్ జాతర. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు అభిమానులను కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం ‘మాస్ జతర’ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా ‘మాస్ జతర’ ట్రైలర్ ఉంది. నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు.
ట్రైలర్ కు మరింత ఆకర్షణ మరియు తాజాదనాన్ని జోడిస్తూ, కథానాయిక శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు. ఆమె మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడినప్పటికీ, ఆ యాసను పూర్తిగా ఆస్వాదిస్తూ అద్భుతంగా పలికిన తీరు ఆశ్చర్యపరిచింది. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే పాటలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ వింటేజ్ మాస్ ఆరాకు సరిగ్గా సరిపోయేలా ఆయన సంగీతం ఉంది. భారీ పోరాట సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అద్భుతమైన పాటలతో విందు భోజనం లాంటి చిత్రానికి ‘మాస్ జాతర’ హామీ ఇస్తోంది.
Ikkada antha okkate zone… adhi MASS MAHARAJ WAR ZONE! 👊⚔️🔥#MassJatharaTrailer Out Now – https://t.co/EsvmFE7ie0#MassJathara is set to deliver a full-on feast of action, fun & entertainment 💣
This Oct 31st, theaters turn into a celebration! 🔥🔥#MassJatharaOnOct31st… pic.twitter.com/Ftd4xhug1r
— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ‘మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది.
మాస్ జాతర ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








