Raashii Khanna : రాశీ ఖన్నాకు కాబోయే భర్త ఏడాదికి ఎంత సంపాదించాలో తెలుసా.. ? దెబ్బకు నెటిజన్స్ షాక్..
తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. తెలుగులో హీరోస్ అందరితో నటించింది.. కానీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ హిట్టైనప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ అందుకోలేదు. తాజాగా ఓ షోలో తనకు కాబోయే భర్త సంపాదన గురించి రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రాశీ ఖన్నా. తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశీ.. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఢిల్లీకి చెందిన ఈ అమ్మడు.. చిన్నప్పటి నుంచి IAS ఆఫీసర్ కావాలనుకుంది. అందుకే చదువుల్లో ముందుండేది. అయితే అనుకోకుండా సినీరంగం వైపు అడుగులు వేసింది. మొదట్లో చిన్న చిన్న ప్రకటనలు చేసిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించింది. 2013లో మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగుతోపాటు తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ మారిపోయింది. జిల్, మనం, జోరు, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
చాలా కాలంగా వరుస సినిమాలతో దక్షిణాదిలో చక్రం తిప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. కొన్నాళ్లుగా హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది. చాలా కాలం తర్వాత ఇటీవలే తెలుసు కదా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దీపావళి పండగ సందర్భంగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెరపై ఓ షోలో పాల్గొన్న రాశీ ఖన్నా.. తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
తెలుసు కదా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ షోలో శ్రీనిధి శెట్టితో కలిసి పాల్గొంది రాశీ ఖన్నా. ఈ క్రమంలోనే మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి ? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడగ్గా.. ఇద్దరు హీరోయిన్స్ బోర్డు పై రాసి చూపించారు. ఇందులో రాశీ తన కాబోయే భర్త గురించి రాసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన కాబోయే భర్త వయసు 35 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలని.. హైట్ 5 అడుగుల 9 అంగుళాల నుంచి 6 అడుగుల 3 అంగుళాల మధ్య ఉండాలని రాసింది. అలాగే బరువు 85 కేజీలు ఉండాలని..ఆస్తులు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. యాక్టర్ కానీ, డాక్టర్ గానీ అయితే ఓకే అని.. ముఖ్యంగా ఏడాదికి కోటి రూపాయల శాలరీ ఉండాలని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ప్రస్తుతం రాశీ రాసిన కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?




