AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ ఇదేం సినిమారా బాబు.! వింత జీవిని పుట్టించి దాంతో అలాంటి పనులు.. చివరకు

ఓటీటీల్లోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో డబ్ అయిన సినిమాలకు యమా క్రేజ్ ఉంది. ఇక ఓటీటీలో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఛీ.. ఛీ ఇదేం సినిమారా బాబు.! వింత జీవిని పుట్టించి దాంతో అలాంటి పనులు.. చివరకు
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Sep 03, 2025 | 10:33 AM

Share

ఓటీటీలో సినిమా సందడి రోజు రోజు ఎక్కువవుతున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో  విడుదలవుతున్నాయి. ప్రతి శుక్రవారం తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక శుక్రవారం థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు అలరిస్తున్నాయి. ఇక హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ కంటెంట్ సినిమాలు విడుదలై మెప్పిస్తున్నాయి. కాగా ట్రెండింగ్ లో ఉన్న సినిమాల్లో ఇప్పుడు ఓ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. బాబోయ్ సీన్ సీన్ కు దిమాక్ ఖరాబ్ అవుతుంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ ఈ సినిమాలో ప్రతి సీన్ ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..  ఎల్సా , క్లైవ్ అనే ఇద్దరు టాలెంటెడ్  జెనిటిక్ ఇంజనీర్లు ఉంటారు. వీరిద్దరూ న్యూ స్త్రాండ్ అనే బయోటెక్నాలజీ కంపెనీకి పనిచేస్తున్నారు. వారి లక్ష్యం వివిధ జంతువుల డీఎన్ఏలను మిక్స్ చేసి కొత్త జీవులను సృష్టించడం.  వాళ్లు అప్పటికే కొన్ని విజయవంతమైన జీవాలను సృష్టిస్తారు. అయితే, వీరిద్దరూ ఇంకో అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నిస్తారు. మనుషుల డీఎన్ఏను కూడా ఈ ప్రయోగంలో కలిపి, ఒక కొత్త జీవాన్ని సృష్టించాలనుకుంటారు. ఇది సరైంది కాదని వాళ్ల కంపెనీ వీరిని నిషేధిస్తుంది. కానీ వారు రహస్యంగా ప్రయోగాన్ని కొనసాగిస్తారు.

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

ఈ ప్రయోగ ఫలితంగా ఒక అసాధారణ జీవం పుట్టుకొస్తుంది. దానికి వారు “డ్రెన్” అని పేరు పెడతారు. అది చాలా త్వరగా పెరిగిపోతుంది. డ్రెన్ తయారీకీ వాడిన మానవ డీఎన్ఏ ఎల్సాది అని క్లైవ్ తెలుసుకుంటాడు. ఓ క్రమంలో డ్రెన్ కి లైంగిక ఆకర్షణ పెరుగుతుంది. ఆతర్వాత వివాదాస్పద సన్నివేశానికి దారితీస్తుంది. డ్రెన్ ఆడ  రూపం నుంచి మగరూపంలోకి మారిపోతుంది. ఆతర్వాత డ్రెన్ మరింత హింసాత్మకంగా మారుతుంది. అందరిని చంపుతుంటుంది. చివరిగా దాన్ని చంపేశారా.? లేక వీరే బలవుతారా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా పేరు స్ప్లైస్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది..

ఇవి కూడా చదవండి

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం