Cinema : హీరో కంటే విలన్ కే ఎక్కువ రెమ్యునరేషన్.. కట్ చేస్తే.. థియేటర్లలో దుమ్మురేపుతున్న సినిమా..
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై థియేటర్లలో సత్తా చాటుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ చిత్రాలు కాకపోయినా కంటెంట్ బలంగా ఉండడంతో జనాలు బ్రహ్మారథం పట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా విధ్వంసం సృష్టిస్తుంది.

ప్రస్తుతం దక్షిణాదిలో ఒక సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇప్పుడు వరుస రికార్డులతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ? అదే యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటేస్ట్ మూవీ మిరాయ్. ఇప్పుడు ఈ మూవీ కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ సినిమా జనాలను తెగ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని కథ, VFX, నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. సెప్టెంబర్ 12న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తేజ సజ్జా చిత్రం మిరాయ్ ఒక సోషల్-ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
మిరాయ్ మొదటి రోజు భారతదేశం అంతటా రూ. 13.77 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. మొత్తం రూ. 27.50 కోట్లు వసూలు చేసింది. తేజ సజ్జా కెరీర్‌లో ఇది అతిపెద్ద ఓపెనింగ్. తేజ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును దాటింది. రెండవ రోజు రూ.55.60 కోట్లు వసూలు చేసింది. వారాంతం నాటికి రూ.81.20 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు తేజ సజ్జా రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. విలన్ గా నటించిన మంచు మనోజ్ రూ.3 కోట్లు తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా కీలక పాత్ర పోషించారు. నిజానికి చెప్పాలంటే ఈ సినిమాలో అతడి పాత్రే హైలెట్. బ్లాక్ స్వోర్డ్ గా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందులోమహాయోధ తల్లి పాత్రను పోషించిన శ్రియ రూ.2 కోట్లు తీసుకుందట. తేజ సజ్జా సినిమాలో జగపతి బాబు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. అతను రూ.1.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడు. ఈ సినిమాలో ప్రధాన నటి రితికా నాయక్ రూ.50 లక్షల వరకు పారితోషికం తీసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?




