Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 18 ఏళ్ల వయసులోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో జనాల ముందుకు వచ్చింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్న వయసులోనే స్టా్ర్ స్టేటస్ సంపాదించుకున్న ఈ హీరోయిన్.. అందం, అభినయంతో ఆకట్టుకుంది. 19 ఏళ్ల వయసులోనే 31 ఏళ్ల స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండిపోయింది. ఇక ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుంది. ఆమె పేరు నజ్రియా నజీమ్. నేరమ్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
ఆ తర్వాత రాజా రాణి, నైయాండి, వైయై మూడి పేసవుం, తిరుమణం ఈ నిక్కా వంటి చిత్రాలతో జనాలను ఆకట్టుకుంది. తెలుగులో అంటే సుందరానికి చిత్రంలో నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత 2018లో కూడే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మలయాళం, తెలుగు భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
ఇదిలా ఉంటే.. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఆమె తమిళంలో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. టీ స్టూడియోస్ నిర్మిస్తున్న ది మద్రాస్ మిస్టరీ- ఫాల్ ఆఫ్ ఎ సూపర్ స్టార్ అనే సిరీస్ లో నటిస్తుంది. ఇటీవల సూర్య సరసన జీతు మాధవన్ తెరకెక్కించనున్న ప్రాజెక్టులో నటించనుందనే టాక్ వినిపించింది. అయితే దీనిపై క్లారిటీ రాలేదు.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..








