Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకరు పాన్ ఇండియా స్టార్ హీరో కాగా.. మరొకరు టాలీవుడ్ కు పరిమితమయ్యారు. కానీ తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ములను గుర్తుపట్టారా.. ? ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని క్యూట్ గా ఫోటోస్ దిగారు. ఇప్పుడు వాళ్లిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోలు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇద్దరికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందులో ఒకరు పాన్ ఇండియా హీరో కాగా.. మరొకరు తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. మాస్ యాక్షన్, ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలతో జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆ ఇద్దరు మరెవరో కాదండి.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్.. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ.
ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..
పెళ్లి చూపులు సినిమాతో హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే కింగ్ డమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
ఇక ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే..దొరసాని సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. విభిన్న కంటెంట్ చిత్రాలతో సక్సె్స్ అయ్యారు. బేబీ సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. విజయ్, ఆనంద్ ఇద్దరికీ తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..




