Tollywood : చేసింది తక్కువ సినిమాలే.. ఎక్కువ అవార్డ్స్ కొట్టేసింది.. స్టార్ హీరోయిన్లకే చుక్కలు చూపించింది..
కేవలం ఒక్క సినిమాతోనే తెలుగు, తమిళం, మలయాళం సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. చేసింది తక్కువ సినిమాలే అయిన ఎక్కువ అవార్డ్స్ గెలుచుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సాధారణంగా సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ వారికి లభించే సరైన గుర్తింపు మాత్రం అవార్డులే. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీలుగా కొనసాగుతున్న చాలా మంది ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. కానీ అందరికి మించిన ఎక్కువ అవార్డ్స్ తీసుకున్న హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఇప్పటివరకు 15 సినిమాల్లోనే నటించింది. కానీ అంతకు మించిన అవార్డులు గెలుచుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే స్టార్ హీరోయిన్లకు గట్టిపోటినిచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. తను మరెవరో కాదండి.. హీరోయిన్ సాయి పల్లవి.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో సైడ్ డ్యాన్సర్ గా పనిచేసింది. ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత తెలుగు ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. పది సంవత్సరాల్లో దాదాపు 15 సినిమాల్లో నటించింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంపిక చేసుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
ఇప్పటివరకు ఈ అమ్మడు దాదాపు 47 సార్లు అవార్డులకు నామినేట్ అయి మొత్తం 28 అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక నయనతార తొలి పదేళ్లలో కేవలం 15 అవార్డ్స్.. త్రిష తొలి పదేళ్లలో 19 మాత్రమే గెలుచుకుంది. సాయి పల్లవి ఆరు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. ప్రేమమ్, లవ్ స్టోరీ, అమరన్ చిత్రాలకు మూడు సార్లు సైమా అవార్డ్స్ అందుకుంది. అలాగే రెండు ఆనంద వికటన్, రెండు ఆసియా నెట్ అవార్డ్స్, చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండు అవార్డ్స్ గెలుచుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..




