AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirai Review: అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలంటే కష్టమేగా..! హిట్టా..? ఫట్టా..?

Mirai Review: అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలంటే కష్టమేగా..! హిట్టా..? ఫట్టా..?

Phani CH
|

Updated on: Sep 12, 2025 | 5:55 PM

Share

హనుమాన్ సినిమాతో సూపర్‌ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ఇక ఇప్పుడేమో మిరాయ్ లో 'సూపర్ యోధా' గా మన ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను భారీ స్కేల్‌లో రూపొందించాడు. భారతీయ పురాణాలు, ఫాంటసీ, హై-ఇంటెన్సిటీ యాక్షన్‌తో ఈ సినిమాను క్రాఫ్ట్ చేశాడు. మరి వీరి ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? తెలుసుకోవాలంటే.. ఈ రివ్యూ కంటిన్యూ చేయండి.

మిరాయ్‌ కథలోకి వెళితే.. వేద ప్రజాపతి అలియాస్ తేజ సజ్జ ఒక అనాధ. చిన్నప్పుడే ఒక లోక కార్యం కోసం భవిష్యత్తును కూడా చూడగలిగే శక్తి ఉన్న వాళ్ల అమ్మ.. అంబిక అలియాస్ శ్రియా మన హీరో వేదను వదిలేస్తుంది. కళింగ యుద్ధం తర్వాత మళ్లీ అంతటి విధ్వంసం జరగకూడదని.. అశోకుడు తన జ్ఞానాన్ని 9 గ్రంథాలలో నిక్షిప్తం చేసి.. 9 మంది యోధులకు ఇస్తాడు. ఈ క్రమంలోనే ఆ తొమ్మది గ్రంథాలను మహావీర్ లామా అలియాస్ మంచు మనోజ్ చేజెక్కించుకొని దేవుడు అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే మహావీర్ లామా శక్తిమంతుడు. అతడిని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ అతడిని ఆపే ఒకే ఒక్క ఆయుధం మిరాయ్. ఈ క్రమంలోనే ఆ మిరాయ్‌ను చేతబట్టి… మహాలామాను ఎదుర్కొంనేదు వేద ఏం చేశాడు.. ఆయనకు విభా అలియాస్ రితిక నాయక్, హిమాలయాలలో ఉండే అగస్త్య అలియాస్ జయరాం ఎలా సాయపడ్డారు.. వేద తన లక్ష్యం వైపు ఎలా అడుగులు వేసాడు. మహావీర్ లామాను ఎలా అడ్డుకున్నాడు అనేది మిగిలిన కథ. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో.. అడక్కూడదు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే.. మిరాయ్ కూడా అలాంటి సినిమానే. మన పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు.. వీటి కంటే గొప్ప కథలు ఇంకేమున్నాయి. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణానికి.. దేశం మొత్తం కదిలింది. ఈసారి రాముడి కోదండానికి అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ట్రైలర్‌లోనే డైరెక్టర్ కథ మొత్తం చెప్పేశాడు… కళింగ యుద్ధం తర్వాత మళ్లీ అంతటి విధ్వంసం జరగకూడదని.. అశోకుడు తన జ్ఞానాన్ని 9 గ్రంథాలలో అమర్చి 9 మంది యోధులకు ఇస్తాడు. దాన్ని విలన్ చేజెక్కించుకొని దేవుడు అవ్వాలి అనుకుంటాడు. అలా జరగకుండా.. అతడిని ఆపే ఆయుధం మిరాయ్. ఆ మిరయ్‌ చేతబట్టి విలన్‌ను మట్టికరిపిస్తాడు మన హీరో. డైరెక్టర్‌ ఎగ్జాక్ట్‌గా ఈ కథకే… స్టిక్ అయి ఉన్నాడు.ఫస్టాఫ్ హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త కామెడీగా, నెమ్మదిగా వెళుతుంది. ఎప్పుడైతే హీరో అడుగు లక్ష్యం వైపు పడుతుందో అక్కడ నుంచి సినిమా ఆగదు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో వచ్చే సంపాటి ఈగల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్.. సెకండ్ ఆఫ్ లో కూడా రెండు మూడు సీన్స్‌కు గూస్ బంప్స్ గ్యారెంటీ. తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జ. చాలా మంది హీరోలు ఇలాంటి కథలు ట్రై చేస్తారు కానీ.. అన్నీ కుదిరితేనే వర్కౌట్ అవుతాయి. అప్పుడు హనుమాన్.. ఇప్పుడు మిరాయ్.. ఈ రెండు తేజకు కుదిరాయి.. మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు కోట్లాది మంది కొలిచే దైవం.. నడిపించే ధైర్యం..! మిరాయ్ లో దాన్ని బాగా చూపించాడు డైరెక్టర్. ఇంత పెద్ద కథ చెప్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నెరేషన్ తప్పదు.. అది పెద్ద సమస్య కాదు. ఈగల్ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, క్లైమాక్స్… ఈ మూడు చాలు.. అందర్లో గూస్ బంప్స్ పుట్టడానికి.. పక్కా పైసా వసూల్ అనే కామెట్ మన నోటి నుంచి రావడానికి. అండ్ ఈ ఎడిపోడ్స్‌ పక్కాగా బిగ్ స్క్రీన్ మీదే చూడాలి.. అప్పుడే ఆ ఎక్స్‌పీరియన్స్‌ను వేరే లెవల్లో ఫీల్ అవ్వొచ్చు. తేజ సజ్జ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచాడు యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అదరగొట్టాడు. మంచు మనోజ్ ‘బ్లాక్ స్వోర్డ్’ విలన్‌గా యాక్టింగ్ అదగొట్టాడు. కొన్ని సార్లు హీరోను డామినేట్ చేశాడు. రితికా నాయక్ సపోర్టింగ్ హీరోయిన్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. జగపతి బాబు, జయరామ్ లాంటి సపోర్టింగ్ కాస్ట్ తమ పాత్రల్లో సమర్థవంతంగా నటించారు. అండ్ శ్రీయకు కూడా…లైఫ్ టైం క్యారెక్టర్ పడింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే… డైరెక్టర్ గౌరీ హరి.. తన ఆర్ . ఆర్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. చాలా సన్నివేశాలు కేవలం RR తో హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రాణం. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగానే కాదు సినిమాటోగ్రాఫర్ గానూ సత్తా చూపించాడు.ఇక ఓవరాల్ గా మిరాయ్.. టెక్నికల్ బ్రిలియన్స్ విత్ డివోషనల్ టచ్.. !

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీటు కోసం చితక్కొట్టుకున్న మహిళ, యువకుడు

IPHONE 17: ఐ ఫోన్ 17.. అక్కడ 97 వేలు.. మనకి 1.36 లక్షలు

GST on Petrol Diesel:పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ తగ్గింపు కష్టమే..!

The World’s Billionaires: వెనుకబడ్డ ఎలన్‌ మస్క్‌.. ప్రపంచ కుబేరుడిగా ల్యారీ ఎల్లిసన్

సింపుల్‌గా ముగించేసిన దీపిక కూతురి పుట్టినరోజు వేడుక!