AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST on Petrol Diesel:పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ తగ్గింపు కష్టమే..!

GST on Petrol Diesel:పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ తగ్గింపు కష్టమే..!

Phani CH
|

Updated on: Sep 12, 2025 | 1:59 PM

Share

దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆదాయపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతానికి ఈ రెండు ఇంధన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) విధిస్తున్నాయి. ఈ రెండు పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ స్థాయిలో ఆదాయం సమకూరుతోందని సంజయ్ అగర్వాల్ వివరించారు. ఈ నేపథ్యంలో, రాబడిని కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఇప్పట్లో ఈ నిర్ణయం తీసుకోవడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే విషయంపై స్పందించారు. చట్టపరంగా ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే తుది నిర్ణయం రాష్ట్రాల చేతుల్లోనే ఉందని ఆమె తెలిపారు. రాష్ట్రాలు అంగీకరించి, జీఎస్టీ కౌన్సిల్‌లో పన్ను రేటుపై ఏకాభిప్రాయానికి వస్తే, దానిని చట్టంలో చేర్చడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. 2017 జూలైలో జీఎస్టీని అమలు చేసినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్ వంటి ఉత్పత్తులను దాని పరిధి నుంచి మినహాయించారు. అనేక రాష్ట్రాలకు వాటి మొత్తం పన్ను రాబడిలో 25 నుంచి 30 శాతానికి పైగా ఆదాయం పెట్రో ఉత్పత్తులపై విధించే వ్యాట్ ద్వారానే వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు తమ కీలక ఆదాయ వనరును వదులుకోవడానికి సుముఖంగా లేకపోవడమే ఈ విషయంలో ప్రధాన అడ్డంకిగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The World’s Billionaires: వెనుకబడ్డ ఎలన్‌ మస్క్‌.. ప్రపంచ కుబేరుడిగా ల్యారీ ఎల్లిసన్

సింపుల్‌గా ముగించేసిన దీపిక కూతురి పుట్టినరోజు వేడుక!

TOP 9 ET News: మహేష్, బన్నీ బిజినెస్‌పై గురిపెట్టిన చరణ్‌

నార్త్‌ అమెరికాలో OG విధ్వంసం

180 కోట్ల బడ్జెట్‌లో అప్పుడే 80 కోట్ల వసూళు.. దటీజ్‌ బాలయ్య క్రేజ్‌!