The World’s Billionaires: వెనుకబడ్డ ఎలన్ మస్క్.. ప్రపంచ కుబేరుడిగా ల్యారీ ఎల్లిసన్
ఎలన్ మస్క్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ఎలన్ మస్క్ ఊహించని విధంగా వెనుకబడ్డారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ సహ-వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్, మస్క్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఒరాకిల్ కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా పెరగతడంతో మస్క్ ఆధిపత్యానికి తెరపడింది.
ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, బుధవారం ట్రేడింగ్‌లో ఒరాకిల్ షేరు విలువ ఏకంగా 41 శాతం పెరిగింది. 1992 తర్వాత కంపెనీ షేరు ఒక్కరోజులో ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. కంపెనీ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించిపోవడం, ముఖ్యంగా క్లౌడ్ వ్యాపారంపై అత్యంత సానుకూల అంచనాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్ల ర్యాలీతో ల్యారీ ఎల్లిసన్ వ్యక్తిగత సంపద ఒక్కరోజులోనే 101 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 8.89 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద 395.70 బిలియన్ డాలర్లకు దాదాపు రూ. 34.82 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఒరాకిల్ కంపెనీలో ఎల్లిసన్‌కు 41 శాతం వాటా ఉంది. ఇదే సమయంలో రెండో స్థానానికి పడిపోయిన ఎలన్ మస్క్ సంపద 385 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 33.88 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ ఒక్కరోజు మార్పుతో ఒరాకిల్ మార్కెట్ విలువ కూడా సుమారు 299 బిలియన్ డాలర్లు పెరిగి, లక్ష కోట్ల డాలర్ల మార్క్‌కు చేరువ కావడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింపుల్‌గా ముగించేసిన దీపిక కూతురి పుట్టినరోజు వేడుక!
TOP 9 ET News: మహేష్, బన్నీ బిజినెస్‌పై గురిపెట్టిన చరణ్
180 కోట్ల బడ్జెట్‌లో అప్పుడే 80 కోట్ల వసూళు.. దటీజ్ బాలయ్య క్రేజ్!
తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

