సింపుల్‌గా ముగించేసిన దీపిక కూతురి పుట్టినరోజు వేడుక!
సాధారణంగా సెలబ్రిటీల ఇంట్లో వేడుకలంటే ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అది పిల్లల పుట్టినరోజైనా.. మరే ఫంక్షన్ అయినా ఓ రేంజ్‌లో నిర్వహిస్తారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా తన కుమార్తె పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే తన కూతురి పుట్టినరోజు కోసం దీపిక తనే స్వయంగా కేక్ తయారు చేసి తన తల్లిప్రేమను చాటుకున్నారు.
ఆ కేకును తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. పలువురు సినీ ప్రముఖులు దీపిక కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణెలకు గతేడాది సెప్టెంబర్ 8న కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. తమ ప్రార్థనలకు దక్కిన సమాధానంగా భావించి పాపకు ‘దువా’ అని పేరు పెట్టారు ఈ దంపతులు. తాజాగా సెప్టెంబర్ 9న దువా మొదటి పుట్టినరోజు సందర్భంగా దీపిక స్వయంగా ఒక చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఆ కేక్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ… “నా ప్రేమ భాష ఏంటో తెలుసా? నా కుమార్తె మొదటి పుట్టినరోజు కోసం కేక్ చేయడమే” అని ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన రెండు గంటల్లోనే లక్షలమంది వీక్షించారు. 5 లక్షలమందికి పైగా లైక్ చేస్తూ విషెష్ తెలిపారు. ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నటీమణులు బిపాషా బసు, కాజల్ అగర్వాల్, భూమి పడ్నేకర్ వంటి వారు దువాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు సైతం “స్వీట్ తల్లి నుంచి స్వీట్ బేబీకి స్వీట్ కేక్”, “మీరే స్వయంగా కేక్ చేశారా, గ్రేట్!”, “మీరు బెస్ట్ మమ్మీ” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆడంబరాలకు పోకుండా, ఎంతో సింపుల్‌గా తన ప్రేమను చాటుకున్న దీపిక తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మహేష్, బన్నీ బిజినెస్‌పై గురిపెట్టిన చరణ్
180 కోట్ల బడ్జెట్‌లో అప్పుడే 80 కోట్ల వసూళు.. దటీజ్ బాలయ్య క్రేజ్!
తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే
జాక్ పాట్ కొట్టిన ఇమ్మాన్యుయేల్! బిగ్ బాస్ నుంచి మనోడికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

