AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPHONE 17: ఐ ఫోన్ 17.. అక్కడ 97 వేలు.. మనకి 1.36 లక్షలు

IPHONE 17: ఐ ఫోన్ 17.. అక్కడ 97 వేలు.. మనకి 1.36 లక్షలు

Phani CH
|

Updated on: Sep 12, 2025 | 2:46 PM

Share

యాపిల్ నుంచి కొత్తగా ఐఫోన్ 17 సిరీస్ లాంఛ్ అయింది. మరి లేటెస్ట్ ఐఫోన్ ఇండియాలో కొనాలా? లేదా అమెరికా, దుబాయ్, సింగపూర్ నుంచి తెప్పించుకుంటే డబ్బులు ఆదా చేయొచ్చా? చూసేద్దాం. యాపిల్ కొత్తగా ఐఫోన్ 17 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చింది. అయితే ధరల విషయానికి వచ్చేసరికి, భారతదేశంతో ఇతర దేశాల మధ్య బాగా తేడాలు కనిపిస్తున్నాయి.

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, కొత్త ఐఫోన్ ఎయిర్ వచ్చాయి. ఈ సిరీస్‌లో ఎ19 చిప్‌సెట్‌, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌, మెరుగైన కెమెరా వ్యవస్థ లాంటి అప్‌గ్రేడ్స్ వచ్చాయి. ఐఫోన్ 17 సిరీస్ ప్రీ ఆర్డర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఇండియాలో సేల్ సెప్టెంబరు 26 నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఇండియాలో కాకుండా అమెరికా, దుబాయ్, సింగపూర్‌ నుంచి కొంటే ఎంత తక్కువకు వస్తుందో చూద్దాం. ట్యాక్స్ లేకుండా అని గమనించాలి. ఐఫోన్ 17 మోడల్‌కి అమెరికాలో ధర 799 డాలర్లు అంటే సుమారుగా 70,344 రూపాయలు. అదే మోడల్ భారత్‌లో 82,900కి లభిస్తోంది. దుబాయ్‌లో దీని ధర రూ.76,817. సింగపూర్‌లో .అయితే 89,267 రూపాయలుగా ఉంది. మొత్తంగా చూస్తే, ఐఫోన్ 17 అమెరికాలోనే తక్కువ ధరకు దొరుకుతోంది. ఐఫోన్ 17 ప్రో, అమెరికాలో 97 వేల రూపాయలుగా ఉంది. భారత్‌లో ఇదే మోడల్ 1,35,000. రూపాయలు. దుబాయ్‌లో రూ.1,07,000. సింగపూర్‌లో 1,20,000. ఈ మోడల్‌కి కూడా అమెరికాలోనే తక్కువ ధర ఉంది. ఇక ఐఫోన్ 17 ప్రో మాక్స్, అమెరికాలో దీని ధర రూ.1,05,000 కాగా భారత్‌లో దీని ధర రూ.1,50,000గా ఉంది, ఇది చాలా ఎక్కువ. దుబాయ్‌లో 1,15,000 సింగపూర్‌లో .1,30,000 కే అందుబాటులో ఉంది. ఈ మోడల్ కూడా అమెరికాలోనే తక్కువ ధరకు లభిస్తోంది. ఇక కొత్తగా పరిచయం చేసిన ఐఫోన్ ఎయిర్, అమెరికాలో $999 అంటే రూ. 87,952గా ఉంది. భారత్‌లో దీని ధర రూ.1,19,900. దుబాయ్‌లో AED 4,299 అంటే రూ.97,157. సింగపూర్‌లో రూ.1,09,883. మిగతా మోడల్స్ లాగానే, ఈ మోడల్‌కి కూడా అమెరికా అత్యంత తక్కువ ధరను అందిస్తోంది. మన దగ్గర ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండడానికి ఇంపోర్ట్ టారిఫ్స్, జీఎస్టీ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వాస్తవానికి యాపిల్ ఇండియాలో అసెంబ్లింగ్, మాన్యుఫాక్చరింగ్ చేస్తున్నా.. ఇంకా ఎక్కువ మోడల్స్ డైరెక్ట్‌గా విదేశాలనుంచే ఇంపోర్ట్ అవుతున్నాయి. అందుకే ధరల్లో 20-25% వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

GST on Petrol Diesel:పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ తగ్గింపు కష్టమే..!

The World’s Billionaires: వెనుకబడ్డ ఎలన్‌ మస్క్‌.. ప్రపంచ కుబేరుడిగా ల్యారీ ఎల్లిసన్

సింపుల్‌గా ముగించేసిన దీపిక కూతురి పుట్టినరోజు వేడుక!

TOP 9 ET News: మహేష్, బన్నీ బిజినెస్‌పై గురిపెట్టిన చరణ్‌

నార్త్‌ అమెరికాలో OG విధ్వంసం