Robbery: రూ. 4 కోట్ల లగ్జరీ కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ
రెండేళ్ల కిందట చోరీకి గురైన లగ్జరీ కారు లంబోర్గిని హురాకాన్ ను చాట్‌జీపీటీ కనిపెట్టింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అమెరికాలో చోరీకి గురైన వాహనాలను గుర్తించి యజమానులకు వాటిని అప్పగించటం అక్కడి అధికారులకు తలకు మించిన సమస్యగా మారింది. దీనికోసం వారు అనేక టెక్నాలజీలను వాడుతున్నప్పటికీ.. ఏఐను వాడడం ఇదే మొదటిసారి.
లంబోర్గిని యజమాని ఆండ్రూ గార్సియా రెండేళ్ల క్రితం తన కారును పోగొట్టుకున్నారు. అదే టైంలో.. ఈ లగ్జరీ కారుతో పాటు ఇతర సూపర్‌కార్లు కూడా చోరీకి గురయ్యాయి. ఆ సమయంలో ఓ ముఠా డజన్ల కొద్దీ లగ్జరీ కార్లను కొట్టేసి.. వాటి యజమానుల పేర్లు తొలగించి రీ సేల్‌కు పెట్టింది. తర్వాత పోలీసులు ఆ మిగిలిన కార్లన్నింటినీ గుర్తించి.. వాటిని అసలు యజమానులకు అందించారు. కానీ.. లంబోర్గిని కారు మాత్రం దొరకలేదు. అయితే.. ఇటీవల ఓ వ్యక్తి ఆ లగ్జరీ కార్ కొనేందుకు.. దొంగల ముఠా వారిని సంప్రదించాడు. వారు.. అతడికి కారును చూపించారు. ఆ టైంలో.. అందులో పడి ఉన్న గార్సియా బిజినెస్ కార్డు ఒకటి.. అతడికి దొరకింది. అతడు.. తర్వాత గార్సియాకు ఫోన్ చేసి.. ‘మీరు నిజంగానే ఈ కారును అమ్మేశారా?’ అని అడిగాడు. అదేంటని గార్సియా అడగగా.. తాను ఈ కారును ఓ సేల్‌లో చూశానని.. కారు ఫోటోలను గార్సియాకు పంపాడు. దీంతో.. గార్సియా స్వయంగా దర్యాప్తు మొదలుపెట్టాడు. చాట్‌జీపీటీ, గూగుల్ లొకేషన్ ఫీచర్లను ఉపయోగించి కారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు అక్కడికి వెళ్లి వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అది గార్సియాదేనని ధ్రువీకరించారు. మనదేశంలోనూ ఇటీవల లంబోర్గిని కారును కొందరు సెలబ్రిటీు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుల్లో శ్రద్ధాకపూర్ వారిలో ఒకరు. శ్రద్ధాకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాహోతో ప్రభాస్ సరసన నటించి తెలుగు ఆడియన్స్‌కు చేరువైందీ చిన్నది. నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై చెత్త వేస్తున్న వ్యక్తి. మున్సిపల్ అధికారులు ఏం చేశారంటే
అట్టుడుకుతున్న నేపాల్.. హింసకు అసలు కారణం అదేనా?
Bigg Boss 9: సంజన Vs లక్స్ పాప.. షాంపూ బాటిల్ కారణంగా.. రచ్చ రచ్చ లొల్లి!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

