AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అట్టుడుకుతున్న నేపాల్‌.. హింసకు అసలు కారణం అదేనా?

అట్టుడుకుతున్న నేపాల్‌.. హింసకు అసలు కారణం అదేనా?

Phani CH
|

Updated on: Sep 11, 2025 | 5:54 PM

Share

నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. దీంతో రంగంలోకి దిగిన నేపాల్‌ సైన్యం శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కర్ఫ్యూ విధించడంతో ఖాట్మండు వీధుల్లో సైనికులను మోహరించారు.

ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంవల్లే నేపాల్‌లోని ప్రస్తుత పరిస్థితికి కారణం. ముఖ్యంగా ‘జనరేషన్ Z’గా పిలుచుకుంటున్న యువత వేలాదిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఏకంగా పార్లమెంట్ భవనానికే నిప్పు పెట్టారు. పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై దాడులు చేసారు. సమాచార శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్‌ను వీధిలో వెంబడించి దాడి చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా, ఆయన భార్య, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్ బాపై వారి నివాసంలోనే మూకదాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన దేవ్ బా, ముఖంపై రక్తంతో నిస్సహాయంగా ఒక పొలంలో కూర్చున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పరిస్థితి విషమించడంతో సైన్యం రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా మంత్రులను, వారి కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కొందరు మంత్రులు రెస్క్యూ బాస్కెట్‌ను పట్టుకుని వేలాడుతూ హెలికాప్టర్‌లో వెళ్తున్న దృశ్యాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఫేస్‌బుక్, ఎక్స్ , యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకోలేదన్న కారణంతో ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. ఇదే నిరసనలకు కారణంగా కనిపిస్తున్నా.. పెరిగిపోయిన నిరుద్యోగం, నేతల పిల్లల విలాసవంతమైన జీవితం మీద యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, నేపాల్ లో 20 శాతం నిరుద్యోగం నమోదు కాగా.. రోజూ 2వేల మంది ఉపాధి కోసం మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ ఆగ్రహమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకుని హింసకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 9: సంజన Vs లక్స్‌ పాప.. షాంపూ బాటిల్ కారణంగా.. రచ్చ రచ్చ లొల్లి!

కూటమి ఐక్యతను చాటిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ

వినాయకుడి అన్నదానంలోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానం

CM అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కామన్ మ్యాన్

చందా ఇవ్వలేదని 4 కుటుంబాల కుల బహిష్కరణ