Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నాడు. ఒకప్పుడు క్యాటరింగ్ బాయ్ గా కనిపించిన అబ్బాయి.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 90 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. 1967లో పాత ఢిల్లీలో జన్మించాడు. రాజీవ్ హరి ఓం భాటియా ఈపేరు జనాలకు అస్సలు తెలియదు. కానీ అతడికి విపరీతమైన క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ కావడానికి చాలా కాలం ముందు, అతను బ్యాంకాక్‌కు వెళ్లాడు. అక్కడ వెయిటర్ గా, చెఫ్ గా వర్క్ చేశాడు. ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత, సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్పించాడు. అతడు మరెవరో కాదండి.. అక్షయ్ కుమార్.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
1992లో వచ్చిన దీదార్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో నటించడానికి ఆయనకు కేవలం రూ.5,000 మాత్రమే పారితోషికం లభించింది. దశాబ్దాల తర్వాత.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరోగా మారారు. ప్రస్తుతం అతడు భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఒక్కో సినిమాకు రూ.90 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అక్షయ్ యాక్షన్, కామెడీ, డ్రామాలలో నటించి మెప్పించాడు.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?
ఇప్పటివరకు రూ.150 పైగా చిత్రాల్లో నటించాడు. ఖిలాడి సినిమా అతడికి మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ సంపాదించిపెట్టింది. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.2500 కోట్లకు పైగానే ఉంటాయి. లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్ సైతం ఉంది.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..




