AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు స్టార్ హీరోలతో సూపర్ హిట్స్.. ఐశ్వర్యరాయ్‌కే రూమ్ మేట్.. ఇప్పటికీ దక్కని స్టార్ స్టేటస్.. ఎవరంటే

1994లో మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీపడింది. సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ లతో కలిసి ప్రపంచ సుందరి పోటీలో నిలబడింది. ఆ సమయంలో ఆమె ఐశ్వర్య రాయ్ రూమ్ మేట్. తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో నటించింది. కానీ ఇప్పటికీ స్టార్ స్టేటస్ రాలేదు.

ఒకప్పుడు స్టార్ హీరోలతో సూపర్ హిట్స్.. ఐశ్వర్యరాయ్‌కే రూమ్ మేట్.. ఇప్పటికీ దక్కని స్టార్ స్టేటస్.. ఎవరంటే
Aishwarya Rai
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2025 | 7:42 PM

Share

1994లో సుస్మితా సేన్ మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. ఆ సమయంలో ఐశ్వర్యరాయ్ రన్నరప్ గా నిలిచింది. ఈ ఐకానిక్ సంవత్సరం వారిద్దరి కెరీర్ మార్చింది. అయితే వీరిద్దరితోపాటు మరో నటి సైతం మిస్ ఇండియా కిరీటం కోసం పోటీపడింది. ఆ తర్వాత ఆమె సినీరంగంలోకి అడుగుపెట్టింది. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ స్టార్ స్టేటస్ సంపాదించుకోలేకపోయింది. ఆమె ఎవరో తెలుసా.. ? మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీపడిన సమయంలో ఆమె ఐశ్వర్యరాయ్ రూమ్ మేట్. ఆమె మరెవరో కాదు.. మలయాళీ హీరోయిన్ శ్వేతా మీనన్.

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..

ఇవి కూడా చదవండి

1994 మిస్ ఇండియా పోటీలో శ్వేతా మీనన్ సైతం ఒక పోటీదారురాలు. కానీ అప్పుడు సుష్మితా సేన్ విన్నర్ కాగా.. ఐశ్వర్యరాయ్ మొదటి రన్నరప్. ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ 2025లో శ్వేత మాట్లాడుతూ… 1994లో ఆమె మిస్ ఇండియా మూడవ రన్నరప్‌ అని… ఆ సమయంలో తాను ఐశ్వర్య రాయ్ రూమ్‌మేట్ అని వెల్లడించింది. మిస్ ఇండియా పోటీ తర్వాత మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మూడవ రన్నరప్ స్థానాన్ని సంపాదించింది. అయితే, మిస్ ఇండియా పోటీ ప్రారంభ రౌండ్లలో ఆమెకు తొలి అడ్డంకి ఎదురైంది. ఆమె మొదటి రన్నరప్‌గా ఎంపికైంది కానీ తక్కువ వయస్సు కారణంగా ఫైనల్స్‌లో పోటీ పడలేకపోయింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..

1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది శ్వేత. ఆ తర్వాత మలయాళంలో స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించింది. 1994లో తన దృష్టిని మోడలింగ్‌పై మళ్లించి, గ్లాడ్రాగ్స్ సూపర్ మోడల్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..