Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
థియేటర్లలో విడుదలైన వెంటనే కన్నడ చిత్రప్రపంచంలో సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ కంటెంట్ నచ్చడంతో జనాలు బ్రహ్మారథం పట్టారు. ఇప్పటికే కాంతార, కేజీఎఫ్ వంటి చిత్రాలను వెనక్కు నెట్టింది. భూతవైద్యం, ప్రేమ, దయ్యాల కథలతో రూపొందించిన ఈ సినిమాను కేవలం 4 కోట్లతో నిర్మించారు.

ఇటీవల బాక్సాఫీస్ షేక్ చేసిన ఓ చిన్న సినిమా గురించి మీకు తెలుసా.. ? భారీ బడ్జెట్ కాదు.. ఎలాంటి హడావిడి లేదు.. ఎక్కువ ప్రమోషన్స్ లేవు.. అయినా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా సంచలనం సృష్టించిన ఈ చిన్న సినిమా గురించి మీకు తెలుసా.. ? కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలకు గట్టిపోటి ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన తర్వాత, ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఇది ఒక హారర్ కామెడీ. ఇందులో అద్భుతమైన మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
ఆ సినిమా పేరు సు ఫ్రమ్ సో. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని పెద్దగా ప్రమోట్ చేయలేదు. కానీ జనాలకు కథ, కథనం, ట్విస్టులు తెగ నచ్చేశాయి. పాజిటివ్ టాక్ తోనే ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి IMDb 8.5 రేటింగ్ ఇచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 9 నుండి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం, ఇది తెలుగు, కన్నడ మలయాళ భాషలలో అందుబాటులో ఉంది. హిందీ, తమిళ భాషలలో ఇంకా స్ట్రీమింగ్ కాలేదు.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
కథ విషయానికి వస్తే.. ఒక గ్రామంలో అశోక్ అనే వ్యక్తికి సులోచన అనే దెయ్యం పట్టిందని గ్రామస్తులు అనుమానిస్తారు. అతడిని ఎలాగైన కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. హర్రర్ కామెడీలో ఒక సందేశం దాగి ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. దాదాపు 41 రోజులపాటు థియేటర్లలో దూసుకుపోయింది. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ నుండి 90 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. దీని ప్రపంచవ్యాప్తంగా రూ.121 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..








