Cinema: ఈ ఏడాదిలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్.. 577 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది.. ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్..
ఇన్నాళ్లు థియేటర్లలో దూసుకుపోయిన సినిమా ఇది. కేవలం 45 కోట్లతో నిర్మిస్తే.. ఏకంగా రూ.577 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. టాప్ 10 జాబితాలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. ఈ ఏడాదిలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఇందులో స్టార్ హీరోహీరోయిన్స్ లేరు. అయినా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

2025 సంవత్సరంలో కొత్త హీరో, హీరోయిన్లు కలిసి నటించిన సినిమా ఇది. కేవలం రూ.45 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.577 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాని ఖర్చు కంటే 12 రెట్లు ఎక్కువ సంపాదించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఇది టాప్ 10 జాబితాలో నంబర్ వన్ స్థానంలో కూడా ట్రెండింగ్‌లో ఉంది. మనం మాట్లాడుతున్న సినిమా పేరు ‘సైయారా’. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇందులో అహన్ పాండే హీరోగా నటించగా.. అతడి సరసన అనితా పద్దా కథానాయికగా నటించింది. సైయారా చిత్రం థియేటర్లలో విడుదలైన వెంటనే హిట్ అయింది. ఈ చిత్రానికి జనాలు బ్రహ్మారథం పట్టారు.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుని ఈ ఏడాది అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ క్రిష్ కపూర్ (అహాన్ పాండే), రచయిత వాణి బాత్రా (అనిత్ పడ్డా)ల ప్రేమకథ. ఇద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది సినిమా. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
సైయారా సినిమా 50 రోజులకు పైగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై కొన్ని గంటల్లోనే టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..




