Siddharth – Aditi Rao: సిద్ధార్థ్, ఆదితి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ఎవరికి ఎక్కువ అంటే..

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వనపర్తిలోని శ్రీ రంగనాయక స్వామీ దేవాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి పెళ్లి వేడుకగా జరిగింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Siddharth - Aditi Rao: సిద్ధార్థ్, ఆదితి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ఎవరికి ఎక్కువ అంటే..
Siddarth, Aditi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2024 | 6:01 PM

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వనపర్తిలోని శ్రీ రంగనాయక స్వామీ దేవాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి పెళ్లి వేడుకగా జరిగింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే. నా నక్షత్ర లోకం కూడా నవ్వే. శాశ్వతంగా మనిద్దరం సోల్ మేట్స్ గా ఉండటానికి.. నవ్వడానికి.. జీవించేందుకు తోడుగా ఉండాలి. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధు” అంటూ రాసుకొచ్చింది అదితి. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, నెటిజన్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అదితి, సిద్ధార్థ్ వివాహం 400 ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ఆలయంలో జరిగింది. వీరిద్దరు కలిసి మహా సముద్రం సినిమాలో నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో కలిగిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే అదే ఆలయంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇక ఇప్పుడు పెళ్లి కూడా అదే ఆలయంలో జరిగింది. వృత్తిపరంగా చూసుకుంటే.. అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ ఇద్దరికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు అనేక చిత్రాల్లో నటించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. వనపర్తి సంస్థానాధీశుల మనవరాలు. ఇప్పటివరకు ఆమె రూ. 60 నుంచి రూ.65 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. అలాగే సిద్ధార్థ్ నికర విలువ దాదాపు రూ.70 కోట్లు ఉంటుందని టాక్. ఇద్దరి ఆస్తులు కలిపి చూస్తే.. మొత్తం రూ.130 నుంచి రూ.135 కోట్ల వరకు ఉంటుందట. అదితి ప్రతి సినిమాకు లేదా వెబ్ సిరీస్ కోసం రూ.కోటి వరకు తీసుకుంటుందట. ఇటీవలే సంజయ్ భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుందని సమాచారం. ప్రస్తుతం గాంధీ టాక్స్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇక సిద్ధార్థ్ ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు తీసుకుంటున్నారు. ఇటీవలే కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2లో కీలకపాత్ర పోషించాడు. ఈ మూవీ కోసం రూ.4 కోట్లు తీసుకున్నాడట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.