AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubilee Hills Bypoll: ‘నవీన్ అన్న చాలా మంచోడు’.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా టాలీవుడ్ హీరో.. వీడియో రిలీజ్

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ జూబ్లిహిట్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. అన్నీ పార్టీలు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ పిలుపు నిచ్చాడు ఒక టాలీవుడ్ హీరో.

Jubilee Hills Bypoll: 'నవీన్ అన్న చాలా మంచోడు'.. కాంగ్రెస్ అభ్యర్థికి  మద్దతుగా టాలీవుడ్ హీరో.. వీడియో రిలీజ్
CM Revanth Reddy, Naveen Yadav
Basha Shek
|

Updated on: Oct 26, 2025 | 11:56 AM

Share

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతోది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారం పర్వంలో మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ కుమార్ యాదవ్ బరిలో నిలిచారు. ప్రచార పర్వంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సింగర్ కమ్ హీరో రాహుల్ సిప్లిగంజ్ నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా నిలిచాడు. నవీన్ అన్న చాలా మంచోడని, గెలిపించాలని కోరాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశాడు.

‘నవీన్ యాదవ్ అన్న చాలా మంచోడు. ఇంజినీరింగ్ చేసిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. అలాంటిది కఠినమని తెలిసి కూడా నవీన్ అన్న రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌ను బాగా అభివృద్ధి చేస్తాడు. ఉన్న క్యాండిడేట్స్‌లో నవీన్ అన్నే బెస్ట్ లీడర్’ అని వీడియోలో చెప్పుకొచ్చారు రాహుల్ సిప్లిగంజ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా రాహుల్ సిప్లిగంజ్ రిలీజ్ చేసిన వీడియో ఇదిగో..

కాగా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికకు నవంబర్ 11న పోలీంగ్ జరగనుంది. 14న కౌంటింగ్ జరగనుంది.  ఈ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి సునీత,  బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. అలాగే భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి