AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో ఈనెల 9న మృతి చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించి తెలంగాణ ఎలక్షన్ కమిషన్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లోనే రిచెస్ట్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హాట్రిక్‌ కొట్టిన గోపినాథ్.. స్థానాన్ని బీఆర్ఎస్‌లో ఎవరు భర్తీ చేస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టిపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ బై ఎలక్షన్‌పై ఫోకస్ చేశారు. ఏ అభ్యర్థిని నిలబెడితే సులభంగా గెలవొచ్చు అన్న విషయంపై మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి ప్రజల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఆదరణ ఏంటో తెలంగాణ మొత్తానికి చాటిచెప్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెబుతున్న BRS, దాన్ని నిరూపించాలంటే కచ్చితంగా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని భావిస్తోంది. దీంతో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ఛాలెంజింగ్‌గా తీసుకుంది.

ఇంకా చదవండి

Jubilee Hills ByPoll Result: జూబ్లీహిల్స్‌ పీఠం కాంగ్రెస్‌దే.. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా, బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

Jubilee Hills ByPoll Results: జూబ్లీహిల్స్‌‌లో హోరాహోరీ.. ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కౌంటింగ్ హోరాహోరిగా కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 44 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండు, మూడు, నాలుగు రౌండ్‌లలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కౌంటింగ్ లో ముందుగా పోస్టల్‌ ఓట్ల లెక్కింపు జరిగింది. దీనిలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

Jubilee Hills By Poll Result: జూబ్లీహిల్స్‌ తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం.. ఇదిగో లేటెస్ట్ ట్రెండ్స్..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. ముందు పోస్టల్‌ ఓట్లు లెక్కింపు చేసిన అనంతరం.. వెంటనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది.. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. మొత్తం మూడు, నాలుగు గంటల్లోనే ఫలితం వెలువడనుంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..

Jubille Hills Result Live: జూబ్లీహిల్స్‌‌లో విజయం దిశగా కాంగ్రెస్.. పార్టీ శ్రేణుల సంబరాలు

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. ముందు పోస్టల్‌ ఓట్లు లెక్కింపు మొదలయ్యింది.. ఆ తర్వాత వెంటనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది.. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం మూడు, నాలుగు గంటల్లోనే ఫలితం తేలనుంది. సీసీకెమెరాల నిఘాలో కౌంటింగ్‌ జరుగుతోంది.

Jubille Hills By Election Result: కౌంటింగ్‌కు ముందు విషాదం.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీచేసిన అభ్యర్థి మృతి..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీచేసిన అభ్యర్థి మృతి చెందారు. మహమ్మద్‌ అన్వర్‌ గుండెపోటుతో చనిపోయారు. NCP నుంచి బరిలోకి దిగిన మహమ్మద్‌ అన్వర్‌ .. ఓట్ల లెక్కింపు ముందే చనిపోయారు.. దీంతో అన్వర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Jubilee Hills ByPoll Result 2025 Highlights: జూబ్లీహిల్స్ పీఠం కాంగ్రెస్‌దే.. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు..

Jubilee Hills By-Election Result 2025 Counting highlights: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది.

జూబ్లీహిల్స్ కౌంటింగ్‌కు పగడ్బందీ ఏర్పాట్లు.. ఫైనల్ రిజల్ట్ వచ్చేదీ ఎప్పుడంటే..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలే సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బాక్స్‌లు ఓపెన్ కాబోతున్నాయి. కౌంటింగ్ కోసం ఈసీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇంతకీ.. ఎన్ని రౌండ్లలో కౌంటింగ్ ఉండబోతోంది? ఫైనల్ రిజల్ట్ రావడానికి ఎంత టైమ్ పట్టొచ్చు? భద్రతా ఏర్పాట్ల సంగతేంటి?

యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర హైటెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్

ఎన్నికల నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట‌్లు వేసేవారికి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నారంటూ మాగంటి సునిత వాగ్వివాదానికి దిగారు. పోలీసుల‌కు, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. చ‌నిపోయిన వ్యక్తుల పేరుతో కూడా ఓటేశారని, ఎన్నికల‌ క‌మిష‌న్ ఎలాంటి చ‌ర్యలు తీసుకోవ‌డం లేదని బీఆర్ఎస్ నేతలు మండిప‌డ్డారు.

ఆరోపణలు, విమర్శలతో ప్రశాంతంగా జూబ్లీహిల్స్ పోలింగ్.. ఈసీకి అధికార, విపక్షాల ఫిర్యాదు!

జూబ్లీహిల్స్ ఎన్నికను అటు అధికార పార్టీ.. ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల పార్టీల మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు దిగడంతో పాటు స్థానికేతరులను ప్రచారం కోసం తిప్పుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

Jubilee Hills By Election: కొనసాగుతోన్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌.. లైవ్ వీడియో

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది. ఎన్నిక కోసం ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కోసం ఓటర్లు పొద్దున్నే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈసారి పోలింగ్ శాతం పెంచడం రాజకీయ పార్టీలతో పాటు, ఈసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది.