AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర హైటెన్షన్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అరెస్ట్

ఎన్నికల నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట‌్లు వేసేవారికి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నారంటూ మాగంటి సునిత వాగ్వివాదానికి దిగారు. పోలీసుల‌కు, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. చ‌నిపోయిన వ్యక్తుల పేరుతో కూడా ఓటేశారని, ఎన్నికల‌ క‌మిష‌న్ ఎలాంటి చ‌ర్యలు తీసుకోవ‌డం లేదని బీఆర్ఎస్ నేతలు మండిప‌డ్డారు.

Maganti Suneetha Arrest
Balaraju Goud
|

Updated on: Nov 11, 2025 | 6:45 PM

Share

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కృష్ణా నగర్ పోలింగ్ బూత్ దగ్గర ఫేక్ ఐడిలతో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధర్నాకు దిగారు. దీంతో కృష్ణా న‌గ‌ర్‌లో ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. కృష్ణాన‌గ‌ర్, శ్రీన‌గ‌ర్ ప‌రిధిలోని ప‌లు పోలింగ్ బూత్‌లల్లో ఇత‌ర ప్రాంతాల నుంచి వచ్చిన మ‌హిళ‌ల‌ను నకిలీ ఆధార్ కార్డులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని మాగంటి సునిత ఆరోపించారు. చివరి నిమిషంలో ఫేక్ ఓట్లు, రిగ్గింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మాగంటి సునీత, బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి నిర‌స‌న‌కు దిగారు.

ఎన్నికల నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట‌్లు వేసేవారికి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నారంటూ మాగంటి సునిత వాగ్వివాదానికి దిగారు. పోలీసుల‌కు, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. చ‌నిపోయిన వ్యక్తుల పేరుతో కూడా ఓటేశారని, ఎన్నికల‌ క‌మిష‌న్ ఎలాంటి చ‌ర్యలు తీసుకోవ‌డం లేదని బీఆర్ఎస్ నేతలు మండిప‌డ్డారు.

అయితే సందర్భంగా BRS, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, మాగంటి సునీత, కౌశిక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. BRS నిరసనపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల ఆందోళనతో భారీగా పోలీసుల మోహరించారు. BRS, కాంగ్రెస్ నేతలను చెదరగొట్టిన పోలీసులు, బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గీత అన్న ఆ మాటలను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లాగవు: నందు

టీ లవర్స్‌ బీకేర్‌ఫుల్‌.. రెండోసారి వేడి చేసి తాగుతున్నారా?

మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంస్థలో సచిన్ భారీ పెట్టుబడి

కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడేనా.. చిన్ననాటి కోచ్ ఏమన్నాడంటే..?

పతిదేవుడ్ని పైకి పంపించింది.. ఏమి తెలియనట్టుగా ప్రియుడితో కలిసి..

ప్రపంచ వెండి కొండకు రాజు ఎవరో తెలుసా..?మన భారత్ ఏ స్థానంలో ఉందంటే

అతని డిజిటల్ వాలెట్‌లో రూ.6,449 కోట్ల విలువైన బిట్‌కాయిన్స్‌..

పైకేమో ర్యాపిడో డ్రైవర్.. కానీ లోపల అసలు మ్యాటర్ వేరుంది..

మిల్కీ బ్యూటీ యు టర్న్ తీసుకోక తప్పదా? వీడియో

ఇదేం దొంగ బుద్ది.. పాక్ అండర్ 19 జట్టుపై మాజీ పేసర్ సంచలన ఆరోపణలు