AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోపణలు, విమర్శలతో ప్రశాంతంగా జూబ్లీహిల్స్ పోలింగ్.. ఈసీకి అధికార, విపక్షాల ఫిర్యాదు!

జూబ్లీహిల్స్ ఎన్నికను అటు అధికార పార్టీ.. ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల పార్టీల మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు దిగడంతో పాటు స్థానికేతరులను ప్రచారం కోసం తిప్పుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

ఆరోపణలు, విమర్శలతో ప్రశాంతంగా జూబ్లీహిల్స్ పోలింగ్.. ఈసీకి అధికార, విపక్షాల ఫిర్యాదు!
Jubilee Hills By Elcetion
Balaraju Goud
|

Updated on: Nov 11, 2025 | 4:29 PM

Share

జూబ్లీహిల్స్ ఎన్నికను అటు అధికార పార్టీ.. ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల పార్టీల మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు దిగడంతో పాటు స్థానికేతరులను ప్రచారం కోసం తిప్పుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్‌ పార్టీ. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆ పార్టీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది కాంగ్రెస్ పార్టీ.

అటు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కంప్లైంట్‌లో ఆరోపించింది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు దిగజారి ప్రవర్తిస్తు్న్నారు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు..పోలింగ్ స్లిప్పులు పట్టుకొని నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు..ఈ ప్రవర్తనతో కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకుందని చెప్పారు.

జూబ్లీహిల్స్‌ పోలింగ్‌లో రిగ్గింగ్‌ జరుగుతోందని బీఆర్ఎస్‌ అభ్యర్ధి మాగంటి సునీత ఆరోపించారు. కాంగ్రెస్‌కి ఓటేయకపోతే బయట తిరగనివ్వం అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. నియోజకవర్గంలో రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఎమ్మెల్యేలకు ఇక్కడ పనేంటి అని సునీత ప్రశ్నించారు. అయితే బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్‌యాదవ్. ఈసీ నిబంధనల ప్రకారమే తమ పార్టీ నేతలు నడుచుకుంటున్నారని..తమ పార్టీ నేతలు ఎవరూ నియోజకవర్గంలో లేరని చెప్పారు.

పోలింగ్ కేంద్రాల సమీపంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని.. దొంగ ఓట్లు వేస్తున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

పోలింగ్ సందర్భంగా పలుచోట్ల పరస్పరం ఘర్షణకు దిగారు మూడు పార్టీల కార్యకర్తలు. బోరబండ స్వరాజ్‌ నగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. కార్పొరేటర్ ఫసియుద్దీన్ తమపై దాడి చేశారంటూ ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను అడ్డుకున్నారు పోలీసులు.

ఇక వెంగళరావు నగర్‌ పోలింగ్ బూత్ నెంబర్ 120 దగ్గర ఓటర్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ గొడవకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే ఏరియాలో సత్తుపల్లి MLA భర్త దయానంద్‌పై ఆర్వోకి ఫిర్యాదు చేశారు BRS నేతలు. వెంగళరావునగర్‌ పోలింగ్‌ బూత్ దగ్గర ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించించింది బీఆర్ఎస్. బీఆర్‌ఎస్‌ ఏజెంట్లను బూత్‌లోకి పంపి తనను అడ్డుకున్నారంటూ షేక్‌పేట్‌ డివిజన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నేత సత్యనారాయణ. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడితో పాటు పోలీసులు సత్యనారాయణకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..